అలోవెరాలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువగానే ఉన్నాయి. మన శరీరానికి ఎంతో మేలు చేసే ఇలాంటి పదార్థాలు ఇందులో ఉంటాయి. మన చర్మం అయినా, జుట్టు అయినా సరే, కలబంద అన్నింటికి చాలా మంచిది. అయితే కలబంద మొక్కలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అవి చర్మానికి, జుట్టుకు మేలు చేస్తాయి. కలబంద జెల్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలతో సహా అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా ఉపయోగిస్తారు. కలబంద పువ్వులను మూలికా కషాయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. జ్యోతిశాస్త్రం ప్రకారం..కలబంద మొక్కతో పాటు దాని పువ్వులు కూడా అనేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా సూచిస్తున్నారు. ఈ పువ్వులు ఆధ్యాత్మిక కోణంలో చాలా ముఖ్యమైనవి.

కలబంద మొక్క నారింజ లేదా ఎరుపు పువ్వులతో వికసిస్తే అది శుభ సంకేతంగా పరిగణిస్తారు. జ్యోతిశాస్త్రంలో కలబంద మొక్క, దాని పువ్వు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. కలబంద పువ్వులు అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో మాత్రమే వికసిస్తాయి. మీ ఇంట్లో కలబంద పువ్వు వికసించాలనుకుంటే సూర్యరశ్మి సమృద్ధిగా లభించే ప్రదేశంలో దీనిని పెంచండి. కలబంద పువ్వు సంపదను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. దీనివల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. కుటుంబ సభ్యులలో ప్రేమ నిండివుంటుంది.
కలబంద పువ్వు ఎవరి ఇంట్లో పెరుగుతుందో ఆ ఇంట్లోని వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఎందుకంటే ఈ పువ్వు సంపదను ఆకర్షించే బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మొక్కలు, పువ్వులకు సూర్యరశ్మి ఎక్కువగా ఉండాలి. కాబట్టి, నీడ ఉన్న ప్రదేశాలో పెట్టకూడదు. కలబంద మొక్కలను ఇంటి లోపల కూడా పెంచవచ్చు. కానీ, అవి ఇంటి లోపల పెరిగే మొక్కలు పూలు పూయని చెబుతున్నారు.