జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ వస్తున్నాడు. తాజాగా రిషబ్ శెట్టి గ్రామం అయిన కెరడి సమీపంలో ఉన్న మూడగల్లు లోని శ్రీ కేశవనాథేశ్వర గుహ ఆలయాన్ని ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి ఫ్యామిలీతో కలిసి సందర్శించాడు. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేశాడు. అయితే మూడగల్లు కేశవనాథేశ్వర్ గుహ దేవాలయం ప్రకృతి అద్భుతానికి ప్రతీక. కర్ణాటకలోని కుందాపూర్ తాలూకా కెరడి గ్రామంలోని మూడగల్లులో ఈ ఆలయం ఉంది. కొద్దిపాటి జన సంచారం మాత్రమే ఉన్న చిన్న పల్లెటూరి మధ్యలో కొలువుదీరిన కేశవనాథేశ్వరుడి ఆలయం అద్భుతంగా ఉంటుంది.
ఈ ఆలయాన్ని జూ.ఎన్టీఆర్ సందర్శించారు. మూడగల్లు కేశవనాథేశ్వర్ గుహ దేవాలయం ప్రకృతి అద్భుతానికి ప్రతీక. కర్ణాటక రాష్ట్రం కుందాపూర్ తాలూకాలోని కెరడి గ్రామంలోని మూడగల్లులో ఈ ఆలయం ఉంది. కొద్దిపాటి జన సంచారం మాత్రమే ఉన్న చిన్న పల్లెటూరి మధ్యలో కొలువుదీరిన కేశవనాథేశ్వరుడి ఆలయం అద్భుతంగా ఉంటుంది. సహజంగా ఏర్పడిన గుహలో కేశవనాథేశ్వరుని దర్శనం మహాద్భుతం. గుహ లోపల దాదాపు 50 అడుగుల దూరం నీటిలో వెళ్లి శివుడ్ని దర్శించుకుంటారు భక్తులు. ఈ నీటిలో అనేక రకాల చేపలు ఉంటాయి.
ఇవి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించవని పూజారులు అంటున్నారు. నీటిలో నిలబడి భగవంతుని దర్శనం, చేపలు పాదాలను ముద్దాడుతున్న అనుభవం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం చాలా పురాతనమైంది. ఈ గుహ లోపల నుంచి శివుడు కాశీకి చేరుకున్నాడని భక్తుల విశ్వాసం. అదే విధంగా ఎందరో మహర్షులు ఇక్కడ తపస్సు చేశారని చెబుతారు. కేశవనాథేశ్వరాలయం, సమీపంలో మెల్య సరస్సు అనుసంధానం అయి ఉంటాయి. ఈ సరస్సులో ఎల్ల అమావాస్య నాడు స్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం చుట్టూ రాతి నేలలు ఉంటాయి.
ఆలయంలో నీటి పరిమాణం ఏడాది పొడవునా ఒకే విధంగా ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం కుందాపూర్ నుంచి కొల్లూరు మీదుగా కెరడి చేరుకుని అక్కడి నుంచి మూడగల్లు వెళ్లవచ్చు. ఉడిపి నుంచి హలాడి మీదుగా కెరడి చేరుకుని అక్కడి నుంచి మూడగల్లు వెళ్లవచ్చు.
ಮೂಡುಗಲ್ಲು ಕೇಶವನಾಥೇಶ್ವರನ ದರ್ಶನ ಪಡೆದಾಗ.. ✨🙏🏼
— Rishab Shetty (@shetty_rishab) September 2, 2024
A blessed journey to Keshavanatheshwara Temple Moodagallu ✨🙏🏼@tarak9999 #PrashanthNeel pic.twitter.com/SWfP2TAWrk