64 యేళ్ళ వయసులో మూడో పెళ్లికి రెడీ అవుతున్న జయసుధ..! వరుడు ఎవరో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

జ‌య‌సుధ ప‌ర్స‌న‌ల్ లైఫ్ మాత్రం నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. మొదట కాకర్లపూడి రాజేంద్రప్రసాద్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న జ‌య‌సుధ‌ 1982లో అత‌నితో విడిపోయింది. మూడేళ్ల తర్వాత నిర్మాత నితిన్‌ కపూర్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. 2017 వరకు ఇద్ద‌రు క‌లిసి అన్యోన్యంగా ఉండేవారు. కాని ఏం జ‌రిగిందో ఏమో కాని ఆయన ఆత్మహత్య చేసుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

ఏడేళ్ల క్రితం అప్పుల బాధ తట్టుకోలేక జ‌య‌సుధ భ‌ర్త ఆత్మహత్య చేసుకున్నాడ‌ని జోరుగా వార్త‌లు రాగా, దానిపై ఇప్ప‌టి వ‌రకు జ‌య‌సుధ స్పందించింది లేదు. తాజాగా దీనిపై ఓ ఇంట‌ర్వ్యూలో జ‌య‌సుధ మాట్లాడుతూ.. నితిన్‌ కపూర్‌ ఆత్మహత్యకు తాను కారణం కాదని చెప్పిన జ‌య‌సుధ‌.. తాను నిర్మించిన సినిమాల వ‌ల‌న ఆయ‌న న‌ష్టాలు చవిచూశాడ‌నేది అవాస్త‌వం.

ఆయ‌నకి అప్పులు పెద్ద స‌మ‌స్యే కాదు. అప్పుల వ‌ల‌న ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకునే మ‌నిషి కాదు. కాక‌పోతే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడ‌ని త‌న‌కి ముందే తెలుస‌ని జ‌య‌సుధ వెల్ల‌డించింది. వారి కుటుంబంలో త‌న అన్న, అత్తగారి ఫ్యామిలీలో ఇద్దరు ఆడపడుచులు కూడా ఇలానే ఆత్మహత్య చేసుకున్నారని, ఏదైనా ప్రెజర్‌గా అనిపిస్తే వాటిని హ్యాండిల్ చేయ‌లేక ఇలా సూసైడ్ చేసుకుంటార‌ని , ఇలా సూసైడ్ చేసుకోవ‌డం ఎప్పటి నుండో వ‌స్తుంద‌ని జ‌య‌సుధ పేర్కొంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈమె 64 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విదేశీ వ్యాపారవేత్తను మూడో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ రూమర్స్ కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో ఈ వార్తలపై జయసుధ స్పందించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే జయసుధ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *