లాయర్ సమక్షంలో జానీ మాస్టర్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. కేసులో కీలమైన టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేశారు. అయితే… ఇంటరాగేషన్‌లో జానీ మాస్టర్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. బాధితురాలు సమర్పించిన ఆధారాలను ముందుపెట్టి జానీ మాస్టర్ దగ్గర పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఆయన గత 5 ఏళ్ళ నుండి తనని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని, లైంగికంగా టార్చర్ చేసాడని, తనని పెళ్లి చేసుకోకపోతే ఇండస్ట్రీ లో అవకాశాలు రానివ్వకుండా చేస్తానని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది.
ఇప్పటికే ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాలో ఒక పాటకి సగం కొరియోగ్రఫీ చేసిన తర్వాత తీసేశారని, జానీ మాస్టర్ ఫోన్ చేసి చెప్పడం వల్లే అలా జరిగిందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే నేడు పోలీస్ కస్టడీ విచారణలో జానీ మాస్టర్ పలు సంచలన విషయాలను బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ ‘ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. ఆ అమ్మాయి తీరు పట్ల నేనే ఎంతో మానసిక క్షోభ కి గురయ్యాను. నన్ను పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయి టార్చర్ పెట్టేది, ఒక ప్రముఖ ఇండస్ట్రీ పెద్ద తో చేతులు కలిపి ఆ అమ్మాయి నాపై లేని కుట్రలు చేస్తుంది.
మేజర్ గా ఉన్నప్పుడే ఆ అమ్మాయి నాకు పరిచయం అయ్యింది. టాలెంట్ ఉన్న అమ్మాయి కావడం తో ఆ అమ్మాయికి అసోసియేషన్ లో డ్యాన్స్ కార్డు ఇప్పించి నా అసిస్టెంట్ గా పెట్టుకున్నాను. తనకి జీవితాన్ని ఇచ్చిన నాపై ఇలాంటి సంచలన ఆరోపణలు చేయడం చాలా బాధని కలిగిస్తుంది’ అంటూ జానీ మాస్టర్ పోలీసుల ముందు ఎమోషల్ అయ్యాడు. ఈ సంఘటనను కేవలం అమ్మాయికి మద్దతుగా మాత్రమే కాకుండా, జానీ మాస్టర్ వైపు కూడా అలోచించి చూడాలి. ఈ అమ్మాయి ఒకసారి జానీ మాస్టర్ ని ఇంటర్వ్యూ చేస్తుంది. ఆ సమయంలో ఆమె ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆమె ముఖం లో చిన్నపాటి అయిష్టం కూడా కనిపించదు.
జానీ మాస్టర్ నిజంగానే ఆమెని వేధించి ఉంటే ఆలా ఉండదు కదా అని కొందరి అభిప్రాయం. అంతే కాదు వీళ్లిద్దరు కలిసి ‘సంచారి’ అనే చిత్రం కూడా చేశారు. జానీ మాస్టర్ ఆ విధంగా ఈమెను అవమానిస్తే, ఆరు నెలలు ఇతనితో ఆ సినిమా కోసం ఎలా పనిచేసింది?, లైంగిక వేధింపులు గత 5 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాడు అని ఆమె చెప్పినప్పుడు, అప్పుడే ఆమె కేసు వేయాలి కదా, ఇన్ని రోజులు ఎందుకు ఆగింది అనే కోణం కూడా చూడాలి. పోలీసులు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని విచారిస్తున్నారు. నిజానిజాలేంటో అతి త్వరలోనే తెలుస్తాయని చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా జానీ మాస్టర్ కి అక్టోబర్ 4 వ తేదీ వరకు రిమాండ్ విధించగా, దానిని కోర్టు పొడిగించే అవకాశాలు ఉన్నాయి.