అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ తనదైన నటనతో ఎంతగానో అలరించింది.. జాన్వీ హిందీలో సూపర్ సక్సెస్ లు అందుకోకపోయిన మంచి నటిగా గుర్తింపు పొందింది.. ఇటీవల ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.. జాన్వీ తల్లి శ్రీదేవికి టాలీవుడ్ తో ఎంతటి అనుబంధం వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న జాను పాప కోట్లు ఇచ్చినా అలాంటి పని చెయ్యను అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. బాలీవుడ్ లో పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా దేవరలో హీరోయిన్ గా నటించింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్‌లతో దూసుకుపోతుంది.
ఈ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ అమ్మడు తన తల్లితో అన్న మాటలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది. తన అమ్మ శ్రీదేవికి ఇచ్చిన మాట గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఏ సినిమాలో అయినా జుట్టు లేకుండా ఉండే పాత్ర చేయాల్సిన పరిస్థితి ఉంటే తాను అస్సలు చెయ్యనని చెప్పిందట. నా జుట్టు కట్ చేసుకోవడానికి నేను అసలు ఇష్టపడనంటూ చెప్పుకొచ్చింది. పాత్ర కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా నేను సిద్ధమే అన్న పాప ఇప్పుడు ఇలా అనడం పై ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.
తన పాత్రల కోసం జుట్టు కట్ చేసుకోవాల్సి వస్తే అలాంటి రోల్స్ నేను చేయను.. నన్ను సంప్రదించవద్దంటూ జాన్వి కామెంట్స్ చేసింది. ప్రస్తుతం జాన్వి చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు ఆ తర్వాత మూడు సినిమాలను లైన్లో పెట్టుకుంది.. రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబోలో కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దాంతో పాటుగా మరో రెండు సినిమాలను లైనప్ లో పెట్టుకుంది.