చెమటలు పట్టేలా జిమ్ లో కష్టపడుతున్న జాన్వీ కపూర్, కళ్ళు చెదిరే వీడియో చూసేయండి.

divyaamedia@gmail.com
2 Min Read

జిమ్ లో చెమటలు చిందించిన ఈ ముద్దుగుమ్మ అక్కడ నుంచి బయటకొస్తు కెమెరాకు క్లిక్ మనిపించింది. అదిరిపోయే అందాలతో కుర్రకారును ఫిదా చేస్తోంది. జిమ్ లుక్‌లో జిగేల్‌మనిపిస్తున్న జాన్వీ కపూర్. అయితే శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్‌కు మంచి క్రేజ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న “దేవర” సినిమాతో ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ “చుట్టమల్లె..“లో జాన్వీ పర్ఫెక్ట్‌ ఫిగర్‌, డ్యాన్స్ స్టెప్పులతో అందరినీ ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది. ఆమె జీరో సైజు నడుము చూసి అందరూ ఫ్లాట్ అయిపోయారు. ఈ ఫిజిక్ మెయింటైన్ చేయడానికి ఈ ముద్దుగుమ్మ చాలా కష్టపడుతుంది. కఠినమైన వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా తన జిమ్ వర్కౌట్ రొటీన్ వీడియోను షేర్ చేసింది. జాన్వీ కపూర్ ఫ్యాషన్ ఐకాన్‌గా, ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె పైలేట్స్ అనే ఒక మీడియం ఇంటెన్సిటీ వర్కౌట్ రెగ్యులర్‌గా చేస్తుంది. అంతేకాకుండా కఠినమైన ఎక్సర్‌సైజ్‌లతో తన స్ట్రెంత్‌ టెస్ట్ చేసుకుంటుంది. లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో జాన్వీ జిమ్ వర్కౌట్ రొటీన్ ఎలా ఉంటుందో చాలా క్లియర్‌గా తెలియజేసింది. అందులో బరువులు ఎత్తడం, కార్డియో వ్యాయామాలు, పైలేట్స్‌ కాంబో వర్కవుట్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో జాన్వీ కపూర్ మొదటగా రోప్ ఎక్సర్‌సైజ్‌ చేస్తూ కనిపించింది. సాధారణంగా ఈ వర్కౌట్ శరీరాన్ని బలపరుస్తుంది.

తర్వాత జాన్వీ ఒక మెషిన్‌పై బరువులను ఉపయోగించి హిప్‌ థ్రస్ట్‌లు చేస్తుంది. ఇది ఆమె గ్లూట్స్ (తొడ కండరాలు)ను బలోపేతం చేస్తుంది. నెక్స్ట్ రోప్స్‌తో పుల్‌అప్స్‌ చేస్తుంది. హైపర్ ఎక్స్‌టెన్షన్ బెంచ్‌పై తన యాబ్స్‌, లోయర్ బ్యాక్, సైడ్స్‌ స్ట్రాంగ్‌గా మార్చుకోవడానికి ఎక్సర్‌సైజ్‌ చేస్తుంది. ఈ వ్యాయామంలో ఈ తార తన కాళ్లను మెషిన్‌పై ఉంచి, తన అప్పర్ బాడీని స్ట్రెయిట్‌గా ఉంచింది. ఒక వెయిట్ పట్టుకుని, నెమ్మదిగా తనను తాను కిందకు వంచుతుంది. వీడియోలో పైలేట్స్ మెషిన్‌ను ఉపయోగించి క్రాస్‌ఓవర్ లెగ్ లిఫ్ట్‌లు చేస్తున్నది కూడా చూపిస్తుంది. ఇది ఆమె కాళ్లను స్ట్రాంగ్‌గా తయారు చేస్తుంది. జాన్వీ కపూర్ తర్వాత ఒక చిన్న బోర్డు మీద నిలబడి స్క్వాట్స్ చేస్తుంది.

ఈ వ్యాయామం చేస్తూ బ్యాలెన్స్ ఎలా కాపాడుకోవాలో ఆమె చూపిస్తుంది. అలాగే, జిమ్‌లో తన కుక్కతో కొంత సమయం గడుపుతున్న దృశ్యం కూడా వీడియోలో కనిపించింది. తర్వాత జాన్వీ ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తుంది. పైలేట్స్ మెషిన్‌పై బరువులుతో రివర్స్ లంజెస్ (LUNGES) వర్కౌట్ చేస్తుంది. ఈ బ్యూటీ బ్యాక్, యాబ్స్‌ , హ్యాండ్ మజిల్స్ బలోపేతం చేయడానికి బాల్ స్లామ్స్ చేస్తుండటం కూడా చూడవచ్చు. వెయిటెడ్ స్క్వాట్స్‌తో ఈ వర్కౌట్ వీడియోను ముగిస్తుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *