బిగ్ అలెర్ట్, జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్, ఇవి తప్పక తెలుసుకోండి.

divyaamedia@gmail.com
2 Min Read

2026 జనవరి 1 నుంచి ఈ కొత్త నియమం అమలులోకి వస్తుంది. ఇది గృహ రుణాలు తీసుకునే వారికి అదిరే శుభవార్త. ఈ నిర్ణయం రుణగ్రహీతలకు మరింత స్వేచ్ఛను అందిస్తుంది, అలాగే బ్యాంకుల మధ్య పోటీని పెంచుతుంది, తద్వారా వినియోగదారులు ఎక్కువ ప్రయోజనాలను పొందగలరు. అయితే కొత్త ఏడాది వస్తుందంటే.. అందరిలోనూ నూతనోత్సాహం వస్తుంది. వచ్చే ఏడాది ఏయే పనులు చేయాలనేది ఓ లక్ష్యం పెట్టుకుంటారు.

దీంతో పాటు న్యూ ఇయర్ వస్తుందంటే ఆర్ధికంగా మనల్ని ప్రభావితం చేసే పలు విషయాల్లో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. క్రెడిట్ రిపోర్ట్‌లో మార్పులు..2026 నుంచి మీ క్రెడిట్ రిపోర్ట్ అప్డేట్‌లో మార్పులు జరగనున్నాయి. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి బ్యాంకింగ్ సంస్థలు అప్డేట్ చేస్తుండగా.. కొత్త ఏడాది నుంచి వారం రోజులకు ఒకసారి ఆ పని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల సిబిల్ స్కోర్ విషయంలో మరింత పారదర్శకత ఉంటుందని, సులువుగా రుణాలు పొందేందుకు ఉపయోగపడుతుందని ఆర్బీఐ చెబుతోంది.

దీని వల్ల మోసపూరితంగా లోన్లు పొందేవారికి చెక్ పడుతుందని అంటోంది. సిమ్ వెరిఫికేషన్ తప్పనిసరి..సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కేంద్రం వాటిని అరికట్టేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక నుంచి సోషల్ మీడియా యాప్‌లు వాడాలంటే సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసింది.

సిమ్ బైండింగ్, వెరిఫికేషన్ చేసేకే యాప్స్ వాడేలా మార్పులు చేయాలని వాట్సప్, టెలిగ్రాం, స్పాప్ చాట్ లాంటి యాప్స్‌ను కేంద్రం ఆదేశించింది. దీంతో కొత్త సంవత్సరం నుంచి దీనిని అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..ఇక జనవరి 1వ తేదీ నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి రానుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఇక 2026 నుంచి ఉద్యోగులకు డీఏ కూడా పెరగనుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉద్యోగుల కనీస వేతనాలను పెంచడానికి సిద్దమవుతున్నాయి.

కొత్త సంవత్సరంలో పెంపును అమల్లోకి తీసుకురానున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధరలు..ప్రతీ నెల 1వ తేదీన వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆ తేదీన కొత్త రేట్లను ఆయిల్ కంపెనీలు ప్రకటిస్తూ ఉంటాయి. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను కాస్త తగ్గించారు. ఇక జనవరి 1న కొత్త ధరలను ప్రకటించనున్నారు. కొత్త ఏడాదిలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉంటాయనేది చూడాలి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *