58 ఏళ్లు జైలుశిక్ష అనుభ‌వించిన తర్వాత నిర్దోషిగా రిలీజైన వ్య‌క్తి, దీంతో పోలీస్ చీఫ్‌ ఏం చేసారో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

1966లో ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఐవా హ‌క‌మ‌డాను అరెస్టు చేశారు. 88 ఏళ్ల హ‌క‌మాడాకు ఆ కేసులో నిజానికి మ‌ర‌ణ‌శిక్ష విధించారు. కానీ అత‌ను ఆ కేసులో అత్యున్న‌త కోర్టును ఆశ్ర‌యించ‌డంతో మూడు ద‌శాబ్ధాల పాటు వాద‌న‌లు జ‌రిగాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ పున‌ర్ ద‌ర్యాప్తుకు కోర్టు అంగీక‌రించింది. వివ‌రాల్లోకి వెళ్తే..1966లో ఓ మ‌ర్డర్ కేసులో ఐవా హ‌క‌మ‌డా అనే మాజీ బాక్సర్‌ను అరెస్టు చేశారు జపాన్‌ పోలీసులు. ఈ కేసును విచారించిన కోర్టు తొలుత హకమడాకు మ‌ర‌ణ‌శిక్ష విధించింది. కానీ అత‌ను ఆ కేసులో అత్యున్నత కోర్టును ఆశ్రయించ‌డంతో దాదాపు ముప్పై ఏళ్లపాటు కోర్టులో విచారణ జరిగింది.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ పున‌ర్ ద‌ర్యాప్తుకు కోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసును 2014లో మ‌ళ్లీ ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ కేసులో హకమడాకు వ్యతిరేకంగా పోలీసులు, ప్రాసిక్యూటర్లు సాక్ష్యాలను రూపొందించారని, అందుకు పోలీసులు సహకరించారని ఆరోపణలు రావడంతో తిరిగి కేసును దర్యాప్తు చేయడానికి కోర్టు అంగీకరించింది. ఈసారి నిర్వహించిన విచార‌ణ‌లో హ‌క‌మ‌డా నిర్దోషిగా తేలాడు. సుమారు 58 ఏళ్ల జైలు శిక్ష త‌ర్వాత అత‌న్ని కోర్టు నిర్దోషిగా విడుద‌ల చేసింది. 60 యేళ్ల న్యాయపోరాటం ముగిసింది. గత నెలలో జైలు నుంచి విడుదలైన హకమడా తన ఇంటికి చేరుకున్నాడు. ఈక్రమంలో షిజోకా జిల్లా ప్రిఫెక్చురల్ పోలీస్ చీఫ్ అతని ఇంటికి సోమవారం వచ్చారు.

అనంతరం ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణలు తెలిపారు. మా వ‌ల్ల నీకు జీవిత కాలం వృద్ధాగా జైలులో గడపవలసి వచ్చిందని, ఎంతో మాన‌సిక క్షోభ మిగిలింద‌ని అందుకు తాము చింతిస్తున్నామని క్షమాపణలు తెలుసుతూ.. హకమడా కూర్చుని ఉన్న సోపాకు ముందుకు వెళ్లి నిటారుగా నిలబడి రెండు చేతులు జోడించి ‘మమ్మల్ని క్షమించు సుడా..’ అని ప్రాధేయపడ్డారు. అసలేం జరిగిందంటే.. 1966 ఆగష్టులో సెంట్రల్ జపాన్‌లోని హమామట్సులో మిసో బీన్ పేస్ట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ని, అతని కుటుంబ సభ్యులలో ముగ్గురిని చంపిన కేసులో సుడా హకమడా అరెస్టయ్యాడు. 1968 జిల్లా కోర్టు అతనికి మొదట మరణశిక్ష విధించబడింది.

అయితే జపాన్‌లో జరిగిన సుదీర్ఘ అప్పీల్, పునర్విచారణ ప్రక్రియ కారణంగా అతని ఉరి వాయిదా పడుతూ వచ్చింది. పునర్విచారణ కోసం ఆయన చేసిన మొదటి అప్పీల్‌ను తిరస్కరించడానికి సుప్రీంకోర్టుకు దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది. 2008లో అతని సోదరి దాఖలు చేసిన పునర్విచారణ కోసం అతని రెండవ అప్పీల్ 2014లో మంజూరు రావడంతె కోర్టు అతన్ని విడుదల చేయాలని ఆదేశించింది. కానీ అతనిపై వచ్చిన నేరారోపణ అలాగే ఉండటంతో విచారణ ప్రక్రియ పెండింగ్‌లో ఉండిపోయింది. హకమడ ప్రపంచంలోనే అత్యధిక కాలం జైలు శిక్ష అనుభవించిన మరణశిక్ష ఖైదీగా పేరుగాంచాడు. యుద్ధానంతర జపాన్‌ పునర్విచారణలో నిర్దోషిగా విడుదల అయిన ఐదవ మరణశిక్ష ఖైదీ కూడా ఇతడే. ఇక్కడ నేర విచారణల సంవత్సరాల పాటు కొనసాగుతుంది. పునర్విచారణ చాలా అరుదుగా ఉంటుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *