జగపతిబాబుకి హీరోయిన్ సౌందర్య విషయంలో బాగా వార్తలు వచ్చాయి. ఈ స్టార్ హీరోయిన్‌ని బాగా ప్రేమించాడని, ఆమెని మళ్లీ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడనే వార్తలు వినిపిస్తుంటాయి. ఆమని కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది. అలాగే పలువురు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే సౌందర్యతో ప్రేమలో పడ్డ విషయం అటుంచితే సౌందర్య అంటే జగపతిబాబుకి చెప్పలేనంత ఇష్టమట.
అయితే ఈ విషయాన్ని జగపతిబాబు సౌందర్య మరణించాక కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొని బాధపడ్డారు. సౌందర్య మరణించాక నా బాధ చెప్పడానికి మాటలు లేవు.ఆమె చనిపోయాక ఒక్క క్షణం నేను కూడా చచ్చిపోవాలి అనే నిర్ణయం తీసుకునేంతలా నా మైండ్ మారిపోయింది. సౌందర్య అంటే ఎనలేని అభిమానం ప్రేమ అంటూ జగపతిబాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇదే విషయం గురించి సినీ జర్నలిస్ట్ ఈ మంది రామారావు మాట్లాడుతూ..

జగపతి బాబుకి సౌందర్య అంటే నిజంగానే ప్రేమ. ఆమె చనిపోయింది అనే మరణ వార్త వినగానే ఆయన కూడా చనిపోదాం అని డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అంతేకాదు చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యారు. కానీ ఆ తర్వాత ఫ్యామిలీ గురించి ఆలోచించి వెనక్కి తగ్గారు అంటూ ఈమంది రామారావు చెప్పారు.అయితే ఇదే విషయంపై జగపతిబాబు మాట్లాడుతూ..
సౌందర్య అంటే నిజంగానే నాకు ప్రేమ.కానీ ఆమె మరణించాక ఆమె ఫ్యామిలీ పైనే నా ఆలోచన అంతా ఉంది. ఆమె ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి వారికి ఎలా న్యాయం చేయాలి అనే ఆలోచన నాకు ఉండేది అంటూ జగపతిబాబు చెప్పుకొచ్చారు.