ఏ తోడూ లేకుండానే అమ్మనవుతాను అని నిర్ణయించుకుంది కన్నడ నటి భావన రామన్న. అందుకే 40 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఆమె ఐవీఎఫ్ ఎంచుకుంది. కడుపులో కవలలను మోసింది. సీమంతం కూడా బాగా జరిగింది. కానీ డెలివరీ రోజు ఒక శిశువు మాత్రమే ప్రాణంతో దక్కింది. ఓ శిశువును కోల్పోయింది. పూర్తీ వివరాలోకి వెళ్తే 40 ఏళ్ల వయసులోనూ ఒంటరిగానే ఉన్న ఆమె ఇటీవల గర్భం దాల్చడంతో నటి పేరు నెట్టింట బాగా మార్మోగిపోయింది.
పెళ్లి చేసుకోకపోయినా అమ్మ అని పిలుపించుకోవాలన్న ఆశతో కృత్రిమ గర్భధారణ పద్ధతి ఐవీఎఫ్ ను ఆశ్రయించింది భావన. ఆమె కోరుకున్నట్లే గర్భం దాల్చడంతో నటి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయింది? ఇక కుటుంబ సభ్యులు ఆమెకు ఘనంగా సీమంతం కూడా చేశారు. ఆ ఫొటోలను కూడా షేర్ చేయగా నెట్టింట వైరలయ్యాయి.
వీటిపై కొందరి నుంచి తీవ్ర వ్యతిరేకత రాగా నటి మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగింది. ఈ క్రమంలో బిడ్డను ఎప్పుడు కందామా? అమ్మా అని ఎప్పుడు పిలిపించుకుందామా? అని కలలు కంటోన్న భావన జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ అందులో ఒకరు కన్నుమూశారు. ఇద్దరు అడ పిల్లలు జన్మించగా ఒక శిశువు శనివారం అస్వస్థతతో మృతి చెందినట్లు తెలిసింది.
మరో శిశువు అరోగ్యవంతురాలిగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గర్భం దాల్చిన ఏడవ నెలలోనే ప్రసవించింది భావన రామన్న. అంతకు ముందే కవలలలో ఒకరికి సమస్యలు ఉన్నట్లు స్కాన్‌లో తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఎనిమిదవ నెలలో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. అందులో ఇద్దరు పిల్లలు పుట్టగా ఒకరు చనిపోయారు. మరొక శివవు ఆరోగ్యంగా ఉంది. భావన కూడా ఆరోగ్యంగా ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
