బెంగళూరు ఇన్ఫోసిస్‌లో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్న నగేష్ స్వప్నిల్ మాలి.. ఆఫీస్ టాయ్ లేట్ లో సీక్రెట్ గా కెమెరా పెట్టి మహిళల వీడియోలు రికార్డు చేస్తు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సదరు మహిళ ఉద్యోగి అతడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తొలుత హెచ్ఆర్ అధికారులకు చెప్పిన మహిళ ఉద్యోగి, ఆ తర్వాత తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఇన్ఫోసిస్ బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ క్యాంపస్‌లో ఉద్యోగుల్ని షాక్‌కు గురిచేసే సంఘటన చోటుచేసుకుంది. ఒక మహిళా ఉద్యోగిని వాష్ రూమ్ ఉండగా.. రహస్యంగా వీడియో తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకున్నారు. జూన్ 30న.. 35 ఏళ్ల మహిళా ఉద్యోగి వాష్‌రూమ్ ఉపయోగిస్తున్న సమయంలో.. ఆమెకు బాత్‌రూమ్ డోర్‌పై ఓ ప్రతిబింబం కనిపించింది.

అర్ధం కాక జాగ్రత్తగా పరిశీలించగా.. పక్క స్టాల్ నుంచి ఒక వ్యక్తి ఫోన్‌తో వీడియో తీస్తున్నాడు. ఆమె కమోడ్‌పైకి ఎక్కి చూడగా.. అతడు ప్యాంట్ విప్పేసి అక్కడ నిలబడి ఉన్నాడు. భయంతో ఆమె వాష్ రూమ్ నుంచి కేకలు వేస్తూ బయటికి వచ్చి.. కొలిగ్స్‌కు విషయం చెప్పింది. వారు వెంటనే అలర్టై అతడని పట్టుకున్నారు. అతడిని స్వప్నిల్ నాగేష్ మాలీ (30)గా గుర్తించారు.
ముంబైకి చెందిన స్వప్నిల్ మూడునెలల క్రితం ఇన్ఫోసిస్‌లో సీనియర్ అసోసియేట్ కన్సల్టెంట్‌గా చేరాడు. సహోద్యోగులు అతని ఫోన్‌ను పరిశీలించగా.. బాధితురాలిని వీడియోతో పాటు మరో మహిళా ఉద్యోగికి సంబంధించిన అభ్యంతరకర వీడియో కూడా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన 50కి పైగా అశ్లీల వీడియోలు లభ్యమయ్యాయి.
బాధితురాలు తన భర్త సహాయంతో కంపెనీ HR విభాగానికి తెలియజేసి… పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరు పోలీసులు స్వప్నిల్‌పై BNS సెక్షన్ 77 , అలాగే ఐటీ చట్టంలోని పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఆ ఉద్యోగిని తొలగించినట్లు, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో ధృవీకరించింది.