ప్రపంచ సుందరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆమెకు ఉన్న అభిమానులు మాత్రం లెక్కలేనంత ఉన్నారని చెప్పవచ్చు. ఈమధ్య సోషల్ మీడియాలో హీరోయిన్స్ ను పోలి ఉన్న అమ్మాయిలు, హీరోల ను పోలి ఉన్న అబ్బాయిలు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే 50 ఏళ్ల వయసులోనూ ఆమె అందం, గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోయిన్లు కూడా ఐష్ అందం ముందు దిగదుడుపే. గతంలో వేగంగా సినిమాలు చేసిన ఐశ్వర్య అభిషేక్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించింది.
వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. ఈ మధ్య ఐశ్వర్య, అభిషేక్ ల విడాకుల వార్తలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఇక సినిమాలు బాగా తగ్గించేసిన ఐష్ ఈ మధ్యన సోషల్ మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటోంది. అయితే అచ్చం ఆమె లాగే కనిపించే ఒక పాకిస్తాన్ అమ్మాయి ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఐశ్వర్యారాయ్ లాగే ముక్కు, అందమైన నీలి కళ్ళు ఉండడంతో నెటిజన్లు ఆమె ఫొటోలను ఐశ్వర్యారాయ్ ఫోటోలతో పోల్చినెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఐష్ డోపెల్ గ్యాంగర్ లా నెట్టింట సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కన్వాల్ సీమా. పేదల గురించి మాట్లాడే వేదికగా, వారికి సహాయం చేసే ‘మై ఇంపాక్ట్ మీటర్’ అనే డిజిటల్ కంపెనీని నిర్వహిస్తోంది సీమా. ఇటీవల పలు న్యూస్ ఛానెల్స్ ఇంటర్యూల్లోనూ పాల్గొన్న ఆమె ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. న్వాల్ సీమా స్కూల్ చదువు మాత్రమే పాకిస్తాన్ లో పూర్తి చేసింది.
ఆ తర్వాత అమెరికా, ఇంగ్లాండ్ లలో ఉన్నత చదువులు అభ్యసించింది. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో 200 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీలో ఉద్యోగాన్ని వదులుకుని స్వదేశానికి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ లో తన స్టార్టప్ కంపెనీని నిర్వహిస్తోంది. కాగా తనని ఐశ్వర్యారాయ్ తో పోల్చడం, ఐష్ డూప్లికేట్ అని నెటిజన్లు చేయడంపై కన్వాల్ సీమా స్పందించింది. ‘నన్ను ఐశ్వర్యా రాయ్ డూప్లికేట్ అని చెప్పడం నచ్చలేదు. నా ఐడెంటిటీ నాకు ఉంది’ అంటూ కామెంట్స్ చేసింది.