ఒకప్పటి మిస్ వరల్డ్.. అందగత్తె.. కళ్లతో మనసు దోచుకునే హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య పేరు తెలియిన సీని అభిమానులు లేరు. దేవదాస్, ధూమ్ 2, జోధా అక్బర్, మోహబత్తేన్, గురు, గుజారిష్, తాల్, జోష్, రోబో, రావణ్, ప్రియురాలు పిలిచింది, సర్కార్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఐశ్వర్య రాయ్ ఖాతాలో ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా ఐశ్వర్య సినిమాల్లో కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే పలు మూవీ ఈవెంట్స్, బాలీవుడ్ పార్టీలలో సందడి చేస్తుంటుంది.
సినిమాల్లో నటించకపోయినప్పటికీ ఐశ్వర్య రాయ్ ఏడాదికి రూ.1 కోటికి పైగా సంపాదిస్తుంది. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఐశ్వర్య ఒకరు. అంతేకాదు ఐశ్వర్య సంపద ఆమె భర్త అభిషేక్ బచ్చన్ కంటే ఎక్కువ. . బాలీవుడ్ లైఫ్ ప్రకారం ఐశ్వర్యరాయ్ నికర విలువ రూ.800 కోట్లు. అభిషేక్ నికర విలువ 280 కోట్లు. పలు నివేదికల ప్రకారం ఐశ్వర్య రాయ్ తన సినిమాలకు భారీ మొత్తంలో వసూలు చేస్తుంది. ఒక్క సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.
అలాగే ఇప్పటివరకు ఎన్నో బ్రాండ్స్ కు ఆమె అంబాసిడర్. ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి కూడా బాగా సంపాదిస్తుంది. ఆమె రోజుకు దాదాపు 6 నుండి 7 కోట్లు వసూలు చేస్తుంది. అలాగే అమె చాలా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2021లో, ఆమె పోషకాహార సేవల కంపెనీలో సుమారు రూ. 5 కోట్ల పెట్టుబడి పెట్టింది. అంతకుముందు, ఆమె బెంగళూరులోని ఎన్విరాన్‌మెంటల్ స్టార్టప్‌లో కోటి రూపాయలు పెట్టుబడి పెట్టింది.
ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా ఐశ్వర్య రాయ్ పర్సనల్ విషయాల గురించి నెట్టింట పెద్ద చర్చే నడుస్తుంది. ఐశ్వర్య ఆమె భర్త అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని.. అందుకే కొన్ని రోజులుగా ఐశ్వర్య ఆమె కూతురు ఆరాధ్యతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారని ప్రచారం నడుస్తుంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.