గతంలో ఐపీఎల్ ఆక్షన్‌లను రిచర్డ్ మ్యాడ్లీ, హ్యూ ఎడ్మీడ్స్, చారు శర్మ వంటి వారు నిర్వహించారు. కానీ 2024 నుంచి మల్లికా సాగర్ ఈ కీలక బాధ్యతను స్వీకరించారు. ఆమె ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్‌ను, సౌదీ అరేబియాలోని జెద్దాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌ను విజయవంతంగా నిర్వహించారు. మల్లికా సాగర్ ఇప్పుడు ఐపీఎల్ వేలంపాటలో ఒక చరిత్ర సృష్టించే వ్యక్తిగా స్థిరపడ్డారు.
అయితే ముంబైలో ఆర్ట్ కలెక్షన్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్న మల్లికా సాగర్.. ముంబైలో ఓ వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆమె యూఎస్ నుంచి తిరిగి వచ్చి ముంబైలోనే నివాసం ఉంటున్నారు. ఆర్ట్ హిస్టరీలో డిగ్రీ పట్టాను అందుకున్న ఆమె.. మోడ్రన్ ఆర్ట్‌లో నిపుణురాలు. అంతర్జాతీయంగా ఇళ్ల వేలంపాటలతో ఆమె కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత భారత్‌లో ఆర్ట్ ఆక్షన్స్‌తో మరింత కమాండ్ సంపాదించుకుకున్నారు.

ప్రో కబడ్డీ లీగ్‌లో ఆక్షనీర్‌గా క్రీడా వేలంపాటల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) ఆక్షనీర్‌గా అవకాశం అందుకున్నారు. ఆమె వేలంపాట పాడే విధానం.. పేర్లను పలికే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఐపీఎల్ వేలంలో మొదటి మహిళా ఆక్షనీర్ మల్లికా సాగర్. ఐపీఎల్ మెగా, మినీ వేలంపాటలతో సహా మార్క్యూ ఈవెంట్‌లకు రెగ్యులర్ ఆక్షనీర్‌గా మారిపోయారు.
మల్లికా సాగర్ స్టేజ్ పర్ఫెక్ట్ టైమింగ్‌తో కూల్‌గా వేలంపాట నిర్వహిస్తారు. చూసేవారిలో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తూ.. వేలం పాడే వారిలో ఉత్కంఠను రేకెత్తించేలా ఆక్షన్ పాడతారు. IPL 2026 మినీ వేలంలో 77 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 10 ఫ్రాంచైజీల పర్స్‌లో రూ. 237.55 కోట్లు ఉంది. ఏ ఆటగాడిపై రేపు కనకవర్షం కురుస్తుందో చూడాలి మరి.
