ఏ తండ్రి అయినా తన కూతురిని కాపాడే ముందు వీడియో ఎందుకు తీస్తాడని అంటున్నారు? ఇలాంటిది నిజంగా జరిగి ఉంటే, ఏ తండ్రి అయినా వెంటనే తన కూతురిని ఎత్తుకుని అక్కడి నుండి పారిపోయేవాడు. అయితే ఈ వీడియోలో ఒక వ్యక్తి అర్ధరాత్రి 3 గంటల తరువాత తన కూతురి గదికి వెళ్తాడు… ఎందుకంటే, అక్కడ నుండి అతడు ఒక వింత నవ్వులు విన్నాడు.
కానీ, అతను అక్కడికి వెళ్లినప్పుడు తను చూసిన దృశ్యం ఎవరికైనా సరే.. గుండెల్లో గుబులు రేపుతుంది.. గుండె వీక్‌గా ఉన్నవారికి హార్ట్ ఎటాక్ కూడా రావొచ్చు. అంతటి భయానక దృశ్యాన్ని చూశాడు అతడు..పూర్తి డిటెల్స్‌లోకి వెళితే… వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక గదిలోని అల్మారా పక్కన నేలపై ఒంటరిగా కూర్చున్న ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది.
మొదట అంతా సాధారణంగానే ఉందని ఆ వ్యక్తి అనుకున్నాడు. కానీ, సడెన్‌గా, భయంకరంగా రెండు చేతులు అల్మారా నుండి బయటకు వచ్చి అమ్మాయి జుట్టుతో ఆడుకోవడం కనిపించింది. ఇది చూసిన ఆ వ్యక్తి భయపడి తన కూతురి వద్దకు పరిగెత్తాడు. కానీ, అప్పటికే ఆ చేతులు మాయమైపోయాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చేతులు బయటకు వస్తున్న ప్రదేశంలో ఒక బొమ్మ మాత్రమే పడి ఉంది. వీడియోలో ఆ వ్యక్తి తన కూతురి భుజంపై చేయి వేసి పిలవటం మీరు చూస్తారు. కానీ, ఆ అమ్మాయి ఏమీ తెలియనట్లుగా స్పందించకుండా నిశ్శబ్దంగా కూర్చుంది.