కొద్ది రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తు్న్నాయి. ఆయా ప్రాంతాలు చిత్తడి చిత్తడిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో రీల్స్ చేయడానికి ప్రయత్నించిన ఒక ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రాణాలు కోల్పోయింది. అయితే 26 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్ షూటింగ్ చేస్తుండగా 300 అడుగుల లోతైన లోయలో పడి ప్రమాదానికి గురైంది. అయితే ఇటీవల మహరాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు చిత్తడిగా మారిపోయాయి.
ఈ క్రమంలోనే రీల్స్ చేయడానికి ప్రయత్నించిన ఓ ట్రావెలింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ లోయలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన రాయ్‌గఢ్ లొని కుంభే జలపాతంలో చోటు చేసుకుంది. మహరాష్ట్రకు చెందిన ఆన్వీ కామ్‌దార్ (26) ఇన్‌స్ట్రాగామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ టూర్లు తిరుగుతూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి ట్రావెలింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకుంది. జులై 16న ఆన్వీ కామ్‌దార్ తన స్నేహితులతో కలిసి కుంభే జలపాతం వద్దకు వెళ్లింది.
రీల్స్ చేస్తున్న సమయంలో ప్రమాద వశాత్తు కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, కోస్ట్ గార్డ్, కోలాడ్ రెస్క్యూ టీమ్ ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆన్వీ మృతదేహాన్ని బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించే లోపు కన్నుమూసింది. విహారయాత్ర విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి.. ఇలాంటి జలపాతాల వద్ద చిత్తడి ఎక్కువగా ఉంటుంది.
అందుకే జలపాతాల వద్దకు యాత్రకు వచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఇలాంటి ప్రమాదకర ప్రదేశాల్లో వీడియోలు, రీల్స్ చేయడం అంత మంచిది కాదని అంటున్నారు. తక్కువ వయసులో ట్రావెలింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మంచి పేరు తెచ్చుకున్న ఆన్వీ కామ్‌దార్ ప్రమాదవశాత్తు చనిపోయిన విషయం తెలుసుకొని ఆమె అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.