ఈ వైరస్ కారణంగా ఐదు రోజుల్లో ఆరుగురు పిల్లలు మృత్యువాతపడ్డారు. వైరస్ బారినపడినవారి సంఖ్య 12కు చేరింది. ఇది అంటువ్యాధి కాదని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని చాందీపురా గ్రామంలో తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించారు. ఇది పిల్లలకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారికి ఫ్లూ వంటి లక్షణాలతో జ్వరం వస్తుంది. తీవ్రమైన మెదడు వాపు కూడా కనిపిస్తుంది. దోమలు, ఈగలు వంటివాటి ద్వారా ఇది వ్యాపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ లో ఓ కొత్త వైరస్ కలకలం రేపుతోంది. దీంతో… ఈ వైరస్ ఎవరికి సోకుతుంది.. లక్షణాలు ఏమిటి అనేది చర్చనీయాంశం అయ్యింది.
అవును… ప్రస్తుతం గుజరాత్ లో అనుమానాస్పద చాందీపురా వైరస్ కలకలం రేపుతోంది. చాందీపురా అనేది మహారాష్ట్రలోని ఓ గ్రామం. 1965లో ఇక్కడ తొలికేసు నిర్ధారణ అయ్యింది. దీంతో… ఈ వైరస్ కు ఆ ఊరి పేరే పెట్టినట్లు చెబుతున్నారు. ఈ వైరస్ ఇప్పుడు మరోసారి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్ వల్ల మంగళవారం మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో… మొత్తం ఈ వైరస్ 14 మందికి సోకగా… ఈ వైరస్ సోకి ఇప్పటివరకూ మృతిచెందినవారి సంఖ్య ఎనిమిదికి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు.
ఇదే సమయంలో రాజస్థాన్ నుంచి ఇద్దరు, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మరొకరికి ఈ వైరస్ సోకినట్లు చెబుతున్నారు. ఈ వైరస్ సోకినవారిలో మరణాల రేటు అధికంగా ఉండటం వల్ల చికిత్సలో ఎలాంటి ఆలస్యం, అశ్రద్ధ చేయకూడదని, అలా చేయడం ప్రాణాంతకమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలో విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వైరస్ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఈ వ్యాది లక్షణాలు, ఎఫెక్ట్ మొదలైన విషాలపై తాజాగా వైద్యులు స్పందిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, విరేచనాలు ఉంటాయని తెలిపారు. తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛ, సృహ కోల్పోవడంతో పాటు మరణం సంభవించొచ్చని అన్నారు. ఈ వైరస్ ఇసుక ఈగలు, దోమలు, పేలు వల్ల సోకుతుందని.. ఇది అంటువ్యాది కాదని చెప్పిన వైద్యులు… 9 నెలల నుంచి 14 ఏళ్ల పిల్లలపై దీని ప్రభావం ఉటుందని తెలిపారు. ప్రస్తుతానికి దీన్ని నిరోధించేందుకు వ్యాక్సిన్ అందుబాటులో లేదని తెలిపారు.