తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి… మరణించడం జరిగింది. ముద్దుగా సభాపతి దక్షిణామూర్తిని ఎస్ డి సభ అని పిలుస్తారు. అయితే ఆయన తీవ్ర అనారోగ్యంతో తాజాగా మృతి చెందారు. 61 సంవత్సరాలు ఉన్న.. దక్షిణామూర్తి… ఆసుపత్రిలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆరోజుల్లో ఉన్న చాలామంది దర్శకులలాగా కాకుండా కాస్త డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని ప్రయత్నించేవారు సభాపతి దక్షిణామూర్తి. అందులో భాగంగానే ‘సుందర పురుషాన్’, ‘వీఐపీ’ లాంటి సినిమాలు తెరకెక్కించారు.
అలా దర్శకుడిగా కెరీర్‌ను పూర్తిగా పక్కన పెట్టకుండా అవకాశం దొరికిన ప్రతీసారి తన సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నారు. అలా వరుసగా అరడజనుకు పైగా తమిళ సినిమాలను డైరెక్ట్ చేసిన తర్వాత ఆయన తెలుగులో కూడా అడుగుపెట్టారు. జగపతి బాబు, కళ్యాణి కాంబినేషన్‌లో ‘పందెం’ అనే మూవీని తెరకెక్కించి నేరుగా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు సభాపతి దక్షిణామూర్తి. తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.
ప్రముఖ సీనియర్ డైరెక్టర్ అయిన సభాపతి దక్షిణామూర్తి అలియాస్ ఎస్‌డీ సభా.. తన 61 ఏట అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సినిమాలను డైరెక్ట్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు సభాపతి. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవల కన్నుమూశారు. దీంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా సభాపతి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. దర్శకుడిగా సభాపతి దక్షిణామూర్తి తెరకెక్కించిన సినిమాలు కొన్నే అయినా.. వాటిని ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా తెరకెక్కించి మంచి గుర్తింపు సాధించారు.