ఇలియానా చివరిసారి 2024లో విడుదలైన హిందీ సినిమా ‘దో ఔర్ దో ప్యార్’ లో కనిపించింది. ఈ చిత్రంలో ఆమెతో పాటు విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ, సెంధిల్ రామమూర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీని తర్వాత మరే సినిమా, సిరీస్ లోనూ ఇలియానా కనిపించలేదు. 2023 ఆగస్టులో తొలిబిడ్డకు జన్మనిచ్చింది.
తన ముద్దుల కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టుకుంది. అదే ఏడాది భర్తతో కలిసి పెళ్లిపీటలెక్కింది. వారి ప్రేమ బంధానికి ప్రతీకగా ఈ ఏడాది జూన్ లో ఇలియానా దంపతులకు రెండో బిడ్డ పుట్టాడు. ఆ పిల్లాడికి కీను రాఫే డోలన్ అని పేరు పెట్టారు. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి తల్లి కానుందని సమాచారం.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇలియానా మూడు రోజుల క్రితం ఓ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. అందులో బేబీ బంప్ తో కనిపించింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ఇలియానాకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇది కొత్త వీడియోనా? ఓల్డ్ వీడియోనా? అన్నది క్లారిటీ రావడం లేదు.
ఇది రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో తీసుకున్న వీడియోలో కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వీడియోను మళ్లీ షేర్ చేయడంతో ఇలియానా మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యిందేమోనని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరి ప్రెగ్నెన్సీ రూమర్లపై ఇలియానా ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
