ఇద్దరి అనుమతితోనే వారు శృంగారంలో పాల్గొంటారు కాబట్టి నేరం కాదని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి తన భార్యను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా తీర్పు చెప్పింది. అయితే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ కారు డ్రైవర్ ఇఫ్తికార్ ఆహ్మద్ దాష్టీకం బయటపడింది. యజమాని భార్యతో కారు డ్రైవర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు బయట పెడతానంటూ యజమానిని తరచూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
అలా చేయకుండా ఉండాలంటే.. తనకు రూ. కోటి నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. అలాగే భార్యకు సైతం విడాకులు ఇవ్వాలంటూ యజమానిని బెదిరిస్తున్నాడు. అలా చేయని పక్షంలో ఆ వీడియోలు బయట పెడతానని యజమానిని బ్లాక్ మేయల్ చేస్తున్నాడు. దీంతో సదరు యజమాని శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయంపై గత కొద్ది రోజులుగా యజమానిని డ్రైవర్ ఇఫ్తికార్ ఆహ్మద్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

అతడి భార్యతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు.. యజమాని సెల్ ఫోన్‌కు పంపాడు. వీటిని అతడి భార్యకు చూపించేందుకు యజమాని ప్రయత్నించాడు. అంతలోనే ఈ ఫొటోలు, వీడియోలను డ్రైవర్ డిలీట్ చేశాడు. దీంతో యజమాని మధ్యవర్తుల ద్వారా ఈ కేసు సెటిల్ చేసుకోవాలని భావించాడు. ఆ క్రమంలో మధ్యవర్తుల వద్ద తనకు రూ. కోటి చెల్లించడంతోపాటు అతడి భార్యకు సైతం విడాకులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. రూ. కోటికి ఒక్క రూపాయి కూడా తగ్గనంటూ డ్రైవర్ భీష్మించుకుని కూర్చొన్నాడు.
ఈ నేపథ్యంలో సదరు యజమాని విసిగిపోయి.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో డ్రైవర్ ఇఫ్తికార్ ఆహ్మద్‌పై పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశాడు. దాంతో డ్రైవర్ ఇఫ్తికార్ ఆహ్మద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.