గొంతులో వేసుకోగానే మృదువుగా జారిపోయే ఇడ్లీ కూడా ప్రాణం తీస్తుందంటే నమ్మలేం. కానీ కేరళలో ఓనం పండగ సందర్భంగా ఇడ్లీ పోటీలలో ఎవరు వేగంగా ఎక్కువ ఇడ్లీలు తింటే వాళ్ళు గెలిచినట్టు ప్రకటిస్తారు. అయితే కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓనం పండుగ సందర్భంగా కంజికోడులో ఇడ్లీ పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కుపోయి ఓ పార్టిసిపెంట్ మృతి చెందాడు. ఈ పోటీలో ఒక్కసారిగా సురేష్ ఇడ్లీలు ఎక్కువగా తినడంతో గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఇబ్బందిపడ్డాడు.
వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేరళలో ఓనం పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కంజికోడ్ గ్రామంలో కొందరు యువకులు ఇడ్లీ తినే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో దురదృష్టవశాత్తు ఓ వ్యక్తి ఇడ్లీ తినేందుకు పోరాడుతూ చనిపోయాడు. ఈ ఘటన సర్వత్రా సంచలనం రేపడంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంజికోడ్ గ్రామానికి చెందిన యువకులు ఇడ్లీ తినే పోటీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలంరం పాలక్కాడ్‌కు చెందిన 50 ఏళ్ల సురేష్ కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాడు. పోటీలో అత్యధికంగా ఇడ్లీలు తిని గెలవాలని అందరూ పోటీ పడ్డారు. ఈసారి ఏకంగా మూడు ఇడ్లీలు తినేందుకు సురేష్ ప్రయత్నించాడు. ఈ ఇడ్లీలు అతని గొంతులో ఇరుక్కుపోవడంతో సురేష్‌కి నొప్పి మొదలైంది. ఆ తర్వాత వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో వాలర్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు.
అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలో ఉంచారు. పోలీసులు అసహజ మరణంగా నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఓ వైపు ఓనం సందడి మధ్య జరిగిన ఈ ఘటన సర్వత్రా దుమారం రేపుతోంది. సురేష్ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.