బ్లూ కలర్ ఈవిల్ ఐ ధరిస్తే చాలు, మీపై ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది.

divyaamedia@gmail.com
2 Min Read

నర దిష్టికి నాపరాళ్లు కూడా పగిపోతాయి అని మన పెద్దోళ్లు ఊరికే అనరు కదా. అది నిజమే. మంచి ఆలోచనతో, నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్న‌ట్టే.. ఈర్ష, ద్వేషంతో చూసే చూపున‌కు, చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుంది. మ‌న చెడు కోరుకునేవారు చూసే చూపు మ‌న జీవితంపై దుష్ప్ర‌భావం పడేలా చేస్తుంది. అయితే ఎందుకంటే అందంగా, ఆనందంగా ఉన్న వాళ్లను చూసి కొంతమందికి అసూయ కలిగి, చెడు దృష్టి పడుతుందని పెద్దల నమ్మకం. దీని నివారణకు చాలా మంది తమ కాళ్లకు నల్ల తాడు కట్టుకుంటారు. ఇలాంటి ఆచారాలను ఇప్పటికీ అనేక కుటుంబాల్లో పాటిస్తున్నారు.

పిల్లలకు దిష్టి నివారణ..చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా ఉండేలా కొన్ని రకాల ఆచారాలు ఫాలో అవుతుంటారు మన పెద్దలు. పిల్లల మెడలకు వెంట్రుకలతో తయారుచేసిన తాడు కట్టడం, కాయిన్ సైజులో నల్ల బొట్టు పెట్టడం లాంటివి చేస్తుంటారు. ఇది పిల్లలను చూసి వారిని ఎంత అందంగా ఉన్నారో అంటున్న వారిలో పుట్టే దిష్టి ప్రభావాన్ని తగ్గించడానికని పెద్దల నమ్మకం. వాహనాలకు కూడా ప్రత్యేక పద్ధతులు..వాహనాలకు కూడా చెడు దృష్టి తగలకుండా ఉండటానికి నిమ్మకాయలు, కర్పూరం లేదా గుమ్మడికాయలతో దిష్టి తీస్తుంటారు.

ఇవి చెడు దృష్టిని తిప్పి వేసేలా పనిచేస్తాయని మన సంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ విధానాలు ఇప్పటికీ మనలో చాలా మంది పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈవిల్ ఐ ప్రాముఖ్యత.. ప్రస్తుత కాలంలో “ఈవిల్ ఐ” అనే వస్తువు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ట్రెండ్లో ఉంది. ఈ ఈవిల్ ఐను ప్రధానంగా బ్లూ కలర్ గాజుతో తయారు చేస్తారు. ఇది రౌండ్ గా కనుపాప లాగా ఉంటుంది. దీన్ని మెడలో లాకెట్‌ లాగా కూడా ధరించడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. చెడు దృష్టి తగలడం వల్ల అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, మరియు దురదృష్టం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని అనేక మంది నమ్ముతారు.

అలాంటి ప్రభావాల నుంచి బయటపడేందుకు బ్లూ కలర్ ఈవిల్ ఐను ధరించడం ద్వారా దిష్టి తగలదని ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. స్పెషల్ కలర్స్..వాస్తవానికి ఈవిల్ ఐ సాధారణంగా బ్లూ కలర్ లో మనకు కనపడుతోంది. కానీ ఇప్పుడు వేరే కలర్స్ లో కూడా మనకు లభిస్తున్నాయి. ఒక్కో కలర్ కి ఒక్కో ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఉదాహరణకు, బ్లూ కలర్ తేజస్సును సూచిస్తే, ఇంకా వేరే కలర్స్ మరెన్నో ప్రతీకలను సూచిస్తాయి. ఈ విధంగా, ఈవిల్ ఐ ఇప్పుడు దిష్టి నివారణకు ఒక ఇంపార్టెంట్ సొల్యూషన్ గా మారింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *