ఏపీలోని ప్రొద్దుటూరుకి చెందిన చందన జ్యోతికు కొత్తగూడెంకు చెందిన యశ్వంత్ కు మూడు నెలల క్రితం వివాహమైంది.. యశ్వంత్ ఓ ప్రైవేటు లో ఉద్యోగం చేస్తున్నాడు.. ఇరువురు కలిసి మూసాపేట్ లో నివాసం ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ గత కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
దీంతో మనస్తాపానికి గురైన చందన జ్యోతి శుక్రవారం రాత్రి అర్ధరాత్రి తన గదిలో ఫ్యాన్ హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన భర్త యశ్వంత్ 108 కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధృవీకరించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తమ కూతురు ఆత్మహత్యకు అల్లుడు యశ్వంత్ కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
