జబర్దస్త్‌తో ఒక్కసారిగా వారి జీవితాలు మారిపోయి ఉండవచ్చు. కానీ గతంలో వాళ్లు కూడా చాలా కష్టాలు పడినవాళ్లే. చిన్నా చితకా పనులు చేస్తూ బండి లాక్కొచ్చినవాళ్లు కొంతమందైతే.. సాఫ్ట్‌వేర్ లాంటి ఉద్యోగాలు చేసినవాళ్లు కూడా జబర్దస్త్‌లో ఉన్నారు. అయితే చమ్మక్ చంద్ర మారుమూల పల్లెటూరు నుంచి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఊరు నుంచి వచ్చి జబర్ధస్త్ ను ఏలాడు. వ్యవసాయ కూలీలుగా ఉన్న తన తల్లీ తండ్రులు, ఇకపై ఏమాత్రం కష్టపడకూడదు అన్న ఉద్దేశంతో.. తన ఊరిలో.. అన్ని సౌకర్యాలతో.. అద్భుతమైన ఇంటిని నిర్మించాడు.
దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించాడు చంద్ర. ఓ ఇంటర్వ్యూలో చంద్ర మాట్లాడుతూ..” నా చిన్నప్పటి నుంచి అమ్మానాన్న కష్టపడటమే నేను చూశాను.. ఆ ఊర్లోనే వాళ్లు ఉన్నంత వరకూ హ్యాపీగా ఉండాలి, ఏ లోటు లేకుండా హాయిగా ఉండాలి, అందుకే వారికోసమే 2 కోట్లు ఖర్చు పెట్టి మాఊరిలో ఇల్లు కట్టాను. ఇప్పటికీ.. మా ఊరికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు” అని చంద్ర వెల్లడించాడు.కమెడియన్ గా చంద్ర మార్క్ సెపరేట్ గా ఉంటుంది. ఆయన కామెడీ స్టైల్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.

బోర్ కొట్టకుండా డిఫరెంట్ థీమ్స్ ను తీసుకుని, తన సోలో పెర్ఫామెన్స్ తో స్కిట్ ను సక్సెస్ చేస్తుంటాడు చంద్ర. మగవారి కష్టాలు, ఆడవారి వేదింపులు, కుటుంబంలో కలహాలు సృష్టించి.. కామెడీ చేసేవారి వ్యక్తిత్వాలను తన స్కిట్ ద్వారా ప్రెసెంట్ చేస్తుంటాడు చమ్మక్ చంద్ర. నిత్యం మన చుట్టు జరిగే గొడవలు, అందులో చూసే పాత్రలను తీసుకుని కడుపుబ్బా నవ్వించడం చంద్రాకు అలవాటైన పని. అందుకే చమ్మక్ చంద్రకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు.
కామెడీతో కడుపుబ్బా నవ్వించడమే కాదు.. తన స్కిట్స్ లో అవకాశాలు ఇచ్చి, చాలామందికి కమెడియన్స్ కు జీవితాన్ని ఇచ్చాడు చంద్ర. రచ్చ రవి టాలీవుడ్ లో కమెడియన్ గా స్థిరపడటానికి చంద్రనే కారణం. ఈ విషయాన్ని ఎన్నో వేదికలపై వెల్లడించాడు రవి. ఇక లేడీ గెటప్ వినోద్, జీవన్, ఆనంద్, సత్య, సత్తిపండు, కొమురం, ఇలా చాలా మంది కమెడియన్స్ కు అవకాశాలు ఇచ్చి.. ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదగడానికి సహాయపడ్డాడు చంద్ర.

ఇప్పటికీ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నా.. తనకు లైఫ్ ఇచ్చిందిమాత్రం జబర్దస్త్ అని గర్వంగా చెప్పుకుంటుంటాడు చమ్మక్ చంద్ర.
