ఈ సెక్యూరిటీ గార్డ్ తో దెయ్యం ఏం చేస్తుందో చుడండి, సీసీ కెమెరాలో భయపెడుతున్న వీడియో.

divyaamedia@gmail.com
1 Min Read

కొందరు దెయ్యాలను తమ కళ్లారా చూశామని చెబుతారు. ఎవరూ నమ్మకపోతే.. అసహనానికి గురవ్వుతారు. దీన్ని బట్టి చూస్తే.. వారు నిజంగా ఏదో చూశారు. కానీ, అది దెయ్యమా కాదా అనేదే సందేహం. అయితే, దెయ్యాల గురించి సైన్స్ ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. దెయ్యాలు ఉన్నట్లు ఆధారాలు కూడా లేవు. అయితే తాజాగా ఒక వ్యక్తి అదృశ్య శక్తితో మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది.

ఒక సెక్యూరిటీ గార్డ్ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు వీడియోలో రికార్డ్ అయింది. అయితే అక్కడ అతడు తప్ప ఎవరూ లేరని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో అతడు దెయ్యంతో మాట్లాడుతున్నాడని వీడియోను వైరల్ చేస్తున్నారు. వీడియో చూస్తే.. ఆఫీస్‌లో ఓ సెక్యూరిటీ కార్డ్ నైట్ డ్యూటీ చేస్తున్నాడు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అతడు సడన్‌గా కూర్చి నుంచి లేచాడు. చేతిలో లాగ్ బుక్ పట్టుకుని ముందుకు వెళ్లాడు.

అంతకు ముందే అక్కడ డోర్ ఓపెన్ అయి వెంటనే క్లోజ్ అయింది. ఆ సమయంలో ఎవరో వచ్చినట్లు, వారి వివరాలను సెక్యూరిటీ గార్డ్ తన లాగ్ బుక్‌లో నోట్ చేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే వచ్చిన మనిషి ఎవరో కనిపించలేదు. ఆ తరువాత సెక్యూరిటీ గార్డ్ బుక్‌ను డెస్క్ మీద పెట్టి, వెంటనే ఒక వీల్‌చైర్ తీసుకొచ్చాడు. అందులో కూర్చోమని ఎవరికో చెబుతున్నాడు.

వీడియోను బాగా పరిశీలిస్తే సెక్యూరిటీ గార్డ్ కనిపించని వ్యక్తితో మాట్లాడుతూ, సాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆ మనిషి ఎవరో వీడియోలో కనిపించకపోవడంతో అంతా గందరగోళంగా అనిపిస్తుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *