ఇలాంటి వారు తేనె తినకపోవడమే మంచిది, పొరపాటున తిన్నారో..?

divyaamedia@gmail.com
2 Min Read

పచ్చి తేనెను ఒక స్పూను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందో లేదో చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజూ ఒక స్పూను పచ్చితేనెను తినడం వల్ల కొంతమందికి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అయితే తేనెలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించి మనం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. తేనెలో విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్, ఐరన్, ఫైబర్, ఐరన్ వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ తేనె మనకు అన్ని వేళలా మంచే చేస్తుందని చెప్పలేం.

దీనిలో ఎన్నో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నా కొంతమందికి మాత్రం తేనె హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటీస్ ఉన్నవారు పొరపాటున కూడా తేనెను తినకూడదు. ఇది సహజ చక్కెర అని ఎలాంటి హాని చేయదు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తేనెలో ఉంటే ఫ్రక్టోజ్ చక్కెర మూలం. అలాగే ఇది డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలను ఫాస్ట్ గా పెంచుతుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు ఫ్రక్టోజ్ కు దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్తారు.

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు కూడా తేనెను అస్సలు తినకూడదు. ఎందుకంటే తేనెలో ఉండే చక్కెర ప్రధాన వనరు అయిన ఫ్రక్టోజ్ కాలేయ ఆరోగ్యాన్యి మరింత పాడు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్రక్టోజ్ ను జీవక్రియ చేయడంలో కాలేయం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి కొవ్వు కాలేయ వ్యాధులు ఉన్నవారు తేనెను తినకపోవమే మంచిది. దంతాలు, చిగుళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి తేనె మంచిది కాదు. ఎందుకంటే తేనెలో ఉండే నేచురల్ షుగర్ కూడా వీళ్లకు హాని చేస్తుంది. ఇది దంతాలలో కుహరాలను దారితీస్తుంది.

మీ నోటి ఆరోగ్యం బాగున్నప్పటికీ తేనెను లిమిట్ లో తీసుకుంటనే మంచిది. ఎందుకంటే తేనెను ఎక్కువగా తీసుకుంటే చిగుళ్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. చాలా మంది తల్లిదండ్రులు ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు కూడా తేనెను తినిపిస్తుంటారు. కానీ పిల్లలకు తేనెను ఏ కొంచెం ఎక్కువగా పెట్టినా వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే తేనె వారిలో క్లోస్ట్రిడియం సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి నవజాత శిశువుకు తల్లి పాలను పట్టించడమే మంచిది. ఎందుకంటే శిశువు శరీరంలో చక్కెరను తిరిగి నింపడానికి పాలు సరిపోతాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *