20 ఏళ్ల కోరిక.. ఇప్పటికి తీరలేదంటున్న హీరోయిన్, ఆ కోరిక ఏంటో తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

నటన అంటే చిన్నప్పటి నుండి ఇష్టం. 2005లోనే పరిశ్రమకు వచ్చాను. సినిమాలు తప్ప నాకు మరో పని తెలియదు. నేను కేరళ ఫుడ్ బాగా ఇష్టపడతాను. హైదరాబాద్ బిర్యానీ, రైస్ , పెరుగు కూడా నచ్చాయి. పెళ్లి అనేది ఒక బాధ్యత. అందుకే నేను ప్రతి విషయాన్ని ప్రేమిస్తాను. అంత వరకే వెళతాను. సోషల్ మీడియాలో మంచి చెడు రెండూ ఉంటాయి… అని హనీ రోజ్ చెప్పుకొచ్చారు. అయితే శివాజీ హీరోగా నటించిన వచ్చిన ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది హనీరోజ్. కాని టాలీవుడ్ లో మాలీవుడ్ బ్యూటీకి పెద్దగా ఆదరణ దక్కలేదు. అవకాశాలు రాకపోవడంతో..మలయాళ పరిశ్రమకే పరిమితం అయ్యింది.

ఆతరువాత ఆమెలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 40 ఏళ్లు దాటినా.. కూడా బ్యూటీవిషయంలో ఏమాత్రం తగ్గడంలేదు హనీ. రెండేళ్ళ క్రితం వచ్చిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈసినిమాలో నటించి మెప్పించింది హనీ రోజ్. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్ర కారును తన అందంతో తన చుట్టూ తిప్పుకుంది బ్యూటీ. వీరసింహారెడ్డి సినిమా తరువాత హనీరోజ్ ఫ్యాన్స్ తో పాటు..సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది.ఈ అమ్మడుకు ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 4 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చుట్టు అభిమానుల హంగామా కూడా పెరిగింది.

అయితే టాలీవుడ్ నుంచి ఆమెకు చాలా అవకాశాలు వస్తాయి అనుకున్నారు కాని.. సినిమా అవకాశాలు మాత్రం రాలేదు హనీకి .. కాని వ్యాపార సంస్థల ఓపెనింగ్ లు మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి హనీరోజ్ కు. మొత్తం మీద ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు లేకపోయినా కూడా కేవలం ప్రమోషన్స్ తోనే ఫుల్ గా సంపాదించేస్తుందంట ఈ బ్యూటీ.ఆమెకు సినిమా అవకాశాలు లేకపోయినా..ప్యాపార సంస్థల ఓపెనింగ్స్ కు మాత్రం గట్టిగా పిలుస్తున్నారట. సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆమెకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. అంతే కాదు ఎక్కువగా ఈ అవకాశాలు రావడంతో.. ఆహెకూడా దానికోసం గట్లిగానే డిమాండ్ చేసుతుందట.

సినిమాలు లేకపోయినా..ఇలా చేతినిండా సంపాదిస్తోందట హనీరోజ్. ఇక అడపా దడపాసినిమాలు చేసుకుంటూ వస్తోన్న హనీరోజ్ త్వరలో రాచెల్ మూవీతో రాబోతోంది. తాజాగా ఆమెకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. హనీరోజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్డాలు దాటిపోయింది. అయితే ఇంత వరకూ తన మనసుకు నచ్చిన పాత్ర ఆమె చేయలేదట. 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను, కాని నేను ఆశించిన పాత్ర మాత్రలు మాత్రం నాకు రావడంలేదు. నా మనసుకు నచ్చిన పాత్రను ఇంత వరకూ చేయలేకపోయాను.

ఇప్పటి వరకూ చేసిన క్యారెక్టర్స్ అన్నీ అలా చేశాను అంతే. ఇక సినిమాలకంటే షాప్ ఓపెనింగ్స్ ద్వారానే నేను ఫేమస్ అయ్యాను. అలా అయినా అవకాశాలు వస్తాయి అనకుంటే అది కూడా సాధ్యం కావడంలేదు అంటూ ఆవేదన చెందిందట హనీరోజ్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ.. 2005 లో మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. స్టార్టింగ్ లో తెలుగు సినిమాలు చేసినా.. ఇక్కడ పెద్దగా ఫేమ్ సాధించలేకపోయింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *