విజయ్ దళపతి హీరోగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన వారసుడి సినిమాలో శ్రీకాంత్ ప్రేయసిగా కనిపించింది. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతకు ముందు నీలకంఠ దర్శకత్వం వహించిన మాయ సినిమాలో నటించింది. ఇందులో హీరోయిన్ గా కనిపించింది. అలాగే సుధీర్ బాబు సరసన మోసగాళ్లకు మోసగాడు సినిమాతోపాటు తెలుగులో మరికొన్ని చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ నందినికి అంతగా క్రేజ్ రాలేదు.
నందిని రాయ్… దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ‘వారసుడు’ సినిమాలో శ్రీకాంత్ ప్రేయసి పాత్రలో నటించారు. అంతకు ముందు కథానాయికగా నీలకంఠ దర్శకత్వం వహించిన ‘మాయ’, సుధీర్ బాబు సరసన ‘మోసగాళ్లకు మోసగాడు’తో పాటు పలు సినిమాలలో నటించారు. నందినికి భక్తి ఎక్కువ. పండుగలు, ప్రత్యేకమైన సందర్భాలలో ఆవిడ తప్పకుండా భగవంతుని దర్శనం చేసుకుంటారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మోకాళ్ల మెట్టలో మోకాళ్ల మీద మెట్లు తిరుమల చేరుకున్నారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అటు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మోకాళ్ల మెట్టలో మోకాళ్ల మీద మెట్లు ఎక్కుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.