వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని.. సూర్య అనే పాత్రలో జీవించేశాడు. ఇక ఇందులో నానికి అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా.? అతడి అక్క పాత్రలో ఆమె చక్కని అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరో.. బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే.. మీరు షాకవుతారు. ఆ నటి మరెవరో కాదు.. తమిళ హీరోయిన్ అదితి బాలన్.
అరువి అనే చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. అయితే అంతేకాకుండా ఈ సినిమాలో ఆమె నటనకు గానూ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత కుట్టీ స్టోరీతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వచ్చిన కోల్డ్ కేస్ చిత్రంలో నటించింది. అలాగే నివిన్ పౌలీ పదవెట్టు చిత్రంలోనూ మెరిసింది ఈ భామ.
ఇక తెలుగులో సమంతా ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంలో.. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. లేటెస్ట్‌గా ఈ ఏడాదిలోనే రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ మూవీలోనూ అమ్మడు మెరిసింది. ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. మూడు ఇండస్ట్రీలలోనూ సక్సెస్ రేట్ ఎక్కువేనని చెప్పాలి.
అదితి బాలన్.. కేవలం నటి మాత్రమే కాదు.. డ్యాన్సర్, మోడల్, లాయర్ కూడా. సినిమాలే కాకుండా ‘నవరస’, ‘స్టొరీ ఆఫ్ థింగ్స్’ అనే రెండు వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అదితి బాలన్.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.