కమిట్‌మెంట్ ఇస్తేనే బిగ్‌బాస్‌లోకి తీసుకుంటారా..? షాకింగ్ విషయాలు చెప్పిన హిమజ.

divyaamedia@gmail.com
2 Min Read

పలు సీరియల్స్, సినిమాలు, షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి హిమజ. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కొన్ని టీవీ షోలలో అలరిస్తుంది. అయితే బిగ్ బాస్ తర్వాత అనేక బ్రాండ్లు, షాపుల ప్రారంభోత్సవాలు, ఇతర ఈవెంట్‌ల కోసం తనను సంప్రదించారని, పెద్ద మొత్తంలో పారితోషికం ఆఫర్ చేశాయని ఆమె వెల్లడించారు. తన ప్రస్తుత క్రేజ్‌కు బిగ్ బాసే కారణమని హిమజ గట్టిగా చెప్పారు.

అయితే, బిగ్ బాస్ షో తన కెరీర్‌కు నేరుగా ఎలా సహాయపడిందనే విషయంలో ఆమె ఒక ముఖ్యమైన తేడాను వివరించారు. తనలోని నటన ప్రతిభను, విభిన్న పాత్రలను పోషించే సామర్థ్యాన్ని బిగ్ బాస్ వేదికపై తాను ప్రదర్శించలేదని ఆమె పేర్కొన్నారు. “అసలు హిమజ ఏంటని చూపించాను కానీ నా టాలెంట్స్ ఏంటి, నేను ఇలా యాక్ట్ చేయగలను, అలా యాక్ట్ చేయగలను అన్న టాలెంట్స్ నేనేం చూపించలేదు షోలో” అని ఆమె అన్నారు.

కాబట్టి, మూవీ ఆఫర్ల విషయానికి వస్తే బిగ్ బాస్ నేరుగా తన కెరీర్‌కు లింక్ అవ్వదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, సినీ పరిశ్రమలో మహిళలకు ఎదురవుతాయనే కమిట్‌మెంట్‌ల గురించి తరచుగా వినిపించే ఆరోపణలను హిమజ తీవ్రంగా ఖండించారు. బిగ్ బాస్ వంటి షోలలో కమిట్‌మెంట్‌లు ఎక్కువగా ఉంటాయా అనే ప్రశ్నకు ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఈ మధ్య కమిట్‌మెంట్ అనే పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో అర్థం కావట్లేదని అన్నారు. బిగ్ బాస్‌కు ఎంపికయ్యే వ్యక్తులు ఓపెన్ మైండెడ్, స్పోర్టివ్, ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉన్నవారై ఉంటారని ఆమె వివరించారు.

అలాంటి వారితో అసభ్యకరమైన ప్రవర్తనకు ఎవరూ సాహసించరని హిమజ అన్నారు. తనతో పాటు తన స్నేహితులకు మూడు దశల్లో ఇంటర్వ్యూలు జరిగాయని, ఎప్పుడూ అలాంటి ఇబ్బంది ఎదురవలేదని ఆమె స్పష్టంగా చెప్పారు. కొన్ని పర్సనల్ నెగిటివ్ ఎక్స్‌పీరియన్స్‌ల వల్ల కొందరు అలాంటి ప్రచారాన్ని చేస్తుండవచ్చని, కానీ అది అందరికీ వర్తించదని ఆమె తేల్చి చెప్పారు. ఆఫర్లు రావడానికి కమిట్‌మెంట్‌లు కారణమనే పరిశ్రమలోని మరొక ప్రచారాన్ని హిమజ ప్రశ్నించారు. “కమిట్‌మెంట్‌లు ఇవ్వడం వల్ల ఆఫర్ వచ్చింది.

మరి ఆఫర్ రానప్పుడు ఏంటి పాపం, కమిట్‌మెంట్‌లు ఇవ్వట్లేదా? అయ్యో పాపం. ఆ లాజిక్ ఏంటి అసలు?” అని ఆమె వ్యంగ్యంగా అన్నారు. కమిట్‌మెంట్లు ఇచ్చేవారు చాలా బాగా సినిమాలు చేసి సెటిల్ అయి ఉండాలని, కానీ వారు ఎక్కడా కనిపించట్లేదని హిమజ పేర్కొన్నారు. ఈ రకమైన మాటలు విన్నప్పుడు తనకు చాలా కోపం వస్తుందని ఆమె చెప్పారు. నటీనటులు తమ ప్రతిభను చూపించుకోవడానికి అవకాశం లభించడం అత్యంత ముఖ్యమని, కేవలం అవకాశం వస్తేనే వారు తమ టాలెంట్‌ను నిరూపించుకోగలరని ఆమె నొక్కి చెప్పారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *