Trending | చిన్నతనం నుంచి కలిసి పెరగడంతో వాళ్లను పెళ్లి చేసుకుంటే ఆ ఫీల్ ఉండదన్న భావనే వారిలో ఎక్కువుగా ఉంటుంది. అయితే వారిలో కొందరు స్టార్ హీరోలు మాత్రం తమ కుంటుంబసభ్యుల మాటలకు విలువ ఇచ్చి.. వారి కోరిక మేరకు తమ సోంత మరదళ్లనే పెళ్లి చేసుకున్నారు. మరి అందులోను స్టార్ హీరోలు కూడా ఉండడం మరో విశేషం. ఇలా సొంత మరదళ్లనే పెళ్లి చేసుకున్న ఆ స్టార్ హీరోలు ఎవరు ఇప్పుడు చూద్దాం.మొదటగా ఎన్టీఆర్ గారు బసవతారకమ్మ గారు.
అన్నగారు ఎన్టీఆర్ తన సొంత మరదలు అయినటువంటి బసవతారకమ్మ గారిని 1942లో పెళ్లి చేసుకున్నారు. ఈయన సినిమాల్లోకి రాకముందే ఈయన వివాహం జరిగింది.ఆ తరువాత మోహన్ బాబు గారు విద్యాదేవి, నిర్మలా దేవి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు తన సొంత మరదలు అయిన విద్యాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఆమె అనుకోకుండా మరణించడంతో తన సోదరి అయిన నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు.అదే కోవలో టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ తన మరదలు అయిన ఇందిరాదేవిని పెళ్లాడారు.
ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. వీరంతా బాగా సెటిల్ అయిన వారే. తర్వాత కృష్ణ అనుకోకుండా తన తోటి హీరోయిన్ విజయనిర్మలను రెండో భార్యగా స్వీకరించినా కూడా తన మరదలు ఇందిరకు ఏనాడు అన్యాయం చేయలేదు.ఏ ఎన్ ఆర్ గారు అన్నపూర్ణమ్మ. అక్కినేని ఏఎన్ఆర్ గారు తన సొంత మరదలైన అన్నపూర్ణమ్మను 1942లో వివాహం చేసుకున్నారు.
50 ఏళ్ల గురువును పెళ్లి చేసుకున్న38 ఏళ్ల టీవీ నటి..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ కూడా తన అన్నబాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కార్తీ కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల మనస్సులను కూడా గెలుచుకున్నాడు. కార్తీ తన తల్లిదండ్రుల కోరిక మేరకు తన సొంత మేనమామ కుమార్తె రజనీనే పెళ్లాడి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అయితే పెళ్లికి ముందు కార్తీ మిల్కీబ్యూటీ తమన్నాతో ప్రేమలో పడ్డాడని టాక్ ఉంది.