Heavy Rain: హైదరాబాద్ పై విరుచుకుపడుతున్న వరుణుడు, మూడు రోజుల పాటు వానలే వానలు.

divyaamedia@gmail.com
2 Min Read

Heavy Rain: జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాల అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. మరో రెండు గంటలపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శామీర్ పేట్, హకీంపేట్, శంషాబాద్, హయత్ నగర్‌లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు. అయితే తెలంగాణలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తు వరకు విస్తరించిన ఆవర్తనంతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాగాల మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.

Also Read: భారతీయులకు శుభవార్త, వీసా అవసరం లేకుండా కొత్తగా మరో 6 దేశాలకు వెళ్ళొచ్చు.

గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా రాగల మూడు గంటల్లో హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్లగొండ, నారాయణ పేట, సిద్దిపేట, వనపర్తి జిల్లాలకు వర్ష సూచన చేయగా.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు తెల్లవారు జామునుంచే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం కురుస్తోంది.

Also Read: నాగ చైతన్యపై అదిరిపోయిన సమంత రివేంజ్..! సంచలనంగా సమంత సెల్ఫీ.

మల్కాజ్ గిరి, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాతావరణ విభాగం భారీ వర్షం పడుతుందన్న హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ అలర్ట్‌ అయింది. లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసింది. మంగళవారం నుంచి హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంది..తెల్లవారు జామునే మళ్ళీ భారీ వర్షం కురవడంతో హైదరాబాద్‌ వణికిపోయింది. భారీగా కురిసిన వానతో రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. విద్యుత్ కోతలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *