మీకు గుండెపోటు రాకూడదంటే.. ఈ ఒక్కపని చేయండి చాలు..! 99 శాతం మందికి తెలియని రహస్యం.

divyaamedia@gmail.com
2 Min Read

వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. సరైన ఫస్ట్‌ఎయిడ్, టైమ్‌కు వైద్య సహాయం అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అలాంటి టైమ్‌లో హార్ట్‌ ఎటాక్‌ను తట్టుకొని నిలబడటం ఎలాగో తెలుసుకోవడం చాలా అవసరం. అయితే. డాక్టర్ రచిత్ సక్సేనా మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవితానికి వ్యాయామం అత్యంత అవసరం. ఇది కేవలం శరీరాన్ని మాత్రమే కాకుండా, మెదడును చురుకుగా ఉంచుతుంది.

నేడు చాలామంది రాత్రి ఆలస్యంగా వరకు డిజిటల్ పరికరాలకు అతుక్కుపోవడం వల్ల మెదడుకు సరిపడా విశ్రాంతి లభించడం లేదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా లేకపోతే ఏ పనిలోనూ పూర్తి శ్రద్ధ పెట్టలేమని ఆయన చెప్పారు. యోగా, వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాల్లో ప్రతిదానికీ దాని స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. యోగా ప్రయోజనాలు యోగాతో మాత్రమే వస్తాయి, అలాగే పరిగెత్తడం వల్ల కలిగే ప్రయోజనాలు పరిగెత్తడం ద్వారా మాత్రమే లభిస్తాయి.

డాక్టర్ సక్సేనా ప్రకారం, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కార్డియో ఫిట్‌నెస్ చాలా అవసరం. దీనినే కార్డియో వ్యాయామం అని పిలుస్తారు. సాధారణంగా నిమిషానికి 70-80 ఉండే గుండె స్పందన రేటు వ్యాయామం చేస్తున్నప్పుడు 130-140కి చేరితేనే దాన్ని సరైన కార్డియో వ్యాయామంగా పరిగణిస్తారు. దీని వల్ల బరువు నియంత్రణ, మధుమేహం, రక్తపోటు నియంత్రణ, గుండె బలోపేతం వంటి ప్రయోజనాలు ఉంటాయి. యన ఇచ్చిన సలహా ప్రకారం, రోజూ 30-40 నిమిషాల వ్యాయామంలో కనీసం 10 నిమిషాలు పరిగెత్తడం అలవాటు చేసుకోవాలి.

మొదట నెమ్మదిగా నడవడం, ఆపై వేగంగా నడవడం, ఆ తర్వాత నెమ్మదిగా పరిగెత్తడం ప్రారంభించాలి. అలసిపోయే వరకు మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోకూడదు. పరిగెత్తేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: డాక్టర్ సక్సేనా ఒక ముఖ్యమైన సూచన ఇచ్చారు. పరిగెత్తేటప్పుడు ఛాతీలో నొప్పి, విపరీతమైన చెమట లేదా అసౌకర్యం అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపి డాక్టర్‌ను సంప్రదించాలి. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటినవారు పరిగెత్తడం ప్రారంభించే ముందు తప్పనిసరిగా గుండె పరీక్షలు (కార్డియాక్ చెకప్) చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండగలం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *