హస్తసాముద్రికం ప్రకారం అరచేతిలో ఆరు ప్రధాన పత్రాలు ఉంటాయి అంటారు. ఇవి చాలా మంది భవిష్యత్తును మరియు అదృష్టాన్ని నిర్ణయిస్తాయని నమ్ముతారు. అవి హృదయ రేఖ, బుద్ధి రేఖ, ఆయుర్వేద రేఖ, బుధ రేఖ, ఆదిత్య రేఖ, శని రేఖ. అయితే అరచేతిలో ఓ ఆకారం ఉంటే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరట. ఈ ఆకారం ఉంటే జీవితంలో చాలా మార్పులు వస్తాయట. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతాయట. అయితే సంపదను సూచించే ముఖ్య రేఖలు..
అదృష్ట రేఖ (శని రేఖ):- ఈ రేఖ అరచేతి అడుగు భాగం నుంచి మధ్య వేలు వైపు వెళ్తుంది. ఇది వృత్తి, విజయాన్ని సూచిస్తుంది. స్పష్టంగా, బలంగా ఉండే అదృష్ట రేఖ అంటే ఆ వ్యక్తికి అధిక ఆశయం, ప్రణాళికను కట్టుబడి ఉండే శక్తి ఉంది. వృత్తిలో అధిక విజయాన్ని పొందగల సామర్థ్యం వారికి ఉంది.

సూర్య రేఖ (అపోలో రేఖ):- ఈ రేఖ అరచేతి అడుగు భాగం నుంచి ఉంగరపు వేలు వైపు వెళ్తుంది. ఇది సృజనాత్మకత, విజయం పట్ల ఆసక్తిని సూచిస్తుంది. బలమైన సూర్య రేఖ ఉంటే వృత్తిలో గొప్ప విజయం సాధిస్తారు. బృహస్పతి పర్వతం:- చూపుడు వేలు కింద అరచేతిలో ఉండే ఉబ్బెత్తు భాగం.
ఇది మీ ఆశయం, నాయకత్వ లక్షణాలను సూచిస్తుంది. ఈ పర్వతం బాగా అభివృద్ధి చెందితే, ఆ వ్యక్తి సహజ నాయకుడు అవుతాడు. శని పర్వతం:- మధ్య వేలు కింద ఉండే భాగం. ఇది క్రమశిక్షణ, కష్టపడే స్వభావాన్ని సూచిస్తుంది. బాగా అభివృద్ధి చెందిన శని పర్వతం ఉన్నవారు బాధ్యతగా ఉంటారు. ప్రణాళికలకు కట్టుబడతారు.
అదృష్ట త్రిభుజం:- ఇది అదృష్ట రేఖ, బుద్ధి రేఖ, ధన రేఖతో ఏర్పడుతుంది. రేఖలు స్పష్టంగా, త్రిభుజం బాగా ఏర్పడితే, గొప్ప అదృష్టం, విజయం ఉంటుంది.