గురు ప్రసాద్ 2006లో సీనియర్ నటుడు జగ్గేశ్ నటించిన మఠం చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఎద్దేలు మంజునాథ, రంగనాయక సినిమాలకు దర్శకుడిగా పని చేశారు. ప్రసాద్ కర్ణాటక రాష్ట్ర ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. అయితే గురుప్రసాద్ ఇటీవల దర్శకత్వం వహించిన ‘రంగనాయక’ చిత్రం ఘోర పరాజయం పాలైంది. దీంతో అతను పూర్తిగా అప్పుల పాలయ్యాడు. అంతే కాకుండా కొన్ని నెలల క్రితం గురుప్రసాద్ రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
గురుప్రసాద్ గత ఎనిమిది నెలలుగా బెంగళూరు ఉత్తర తాలూకాలోని మదనాయకనహళ్లి సమీపంలోని టాటా న్యూ హావెల్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు అక్కడే గురుప్రసాద్ మృతదేహం కనిపించింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని గమనించిన స్థానికులు తిరిగి చూడగా ఫ్యానీకి వేలాడుతున్న గురుప్రసాద్ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మదనాయకనహళ్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గురుప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కాగా ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. గురు ప్రసాద్ మృతికి నివాళి అర్పిస్తున్నారు. కన్నడ సినీ ప్రముఖ దర్శకుల్లో గురుప్రసాద్ ఒకరు. ‘మఠం’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన గురుప్రసాద్ తొలి సినిమాతోనే రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత దర్శకత్వం వహించిన ‘ఎద్దేలు మంజునాథ’ భారీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘డైరెక్టర్స్ స్పెషల్’ సినిమా చేశాడు. ఈ సినిమా ద్వారా డాలీ ధనంజయ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 2017లో ‘అడ్రడ సాల్’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ‘ఎరదనే సాలా’ సినిమా తర్వాత పెద్ద బ్రేక్ తీసుకున్న గురుప్రసాద్.. అదే ఏడాది జగ్గేష్ తో ‘రంగనాయక’ సినిమా చేశాడు. ఆ సినిమా థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ అయింది. ‘రంగనాయక’ సినిమా పరాజయంతో డిస్టర్బ్ అయిన గురుప్రసాద్ చాలా అప్పుల్లో కూరుకుపోయాడు. ఇక కుటుంబ కలహాల కారణంగా గురుప్రసాద్ మొదటి భార్యతో విడిపోయాడు. కొన్ని నెలల క్రితమే రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు.
Shocking!🚨
— Veena Jain (@DrJain21) November 3, 2024
Famous Kannada movie Director Guruprasad committed Su!c!de
His body found in h@nging condition in his house in Bengaluru pic.twitter.com/ZE3hBXDz5P