నరదృష్టి అనే మాట వినేఉంటారు కదా.. ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు చూసి ఓర్వలేని వారంతా చెడుకోరుకోవడం వల్ల నరదృష్టి కుటుంబం మీద పడుతుందని చెబుతారు. ఈ ప్రభావం పడితే జరగకూడని సంఘటనలు జరుగుతాయని భావిస్తారు…అనారోగ్యం బారిన పడడం, అనవసర వివాదాలు జరుగుతుంటాయి. అయితే అమ్మ దయ ఉంటే ఆన్ని ఉన్నట్టే అనే ఒక మాటే ఎంతో మంది భక్తులను అమ్మవారి ఆలయానికి వెళ్లేలా చేస్తుంది. నిజానికి చెప్పాలంటే భక్తులను కాపాడాలన్నామే, దుష్టులను శిక్షించాలన్నామే. అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నా ఉగ్ర రూపం మాత్రం కాళిక దేవి మాత్రమే.
ఈ రూపంతో ఉన్న దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఒకప్పుడు కాళికా మాత ఆలయం దర్శించుకోవాలంటే అంటే కలకత్తా ఆలయం మాత్రమే గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు కేవలం కొన్ని ప్రాంతాల్లో కాళికా మాత ఆలయాలు నిర్మించారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రంగంపల్లి కాళికా నగర్ ప్రాంతానికి చెందిన కాళికా మాత ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గత 50 ఏళ్లుగా కాళికా మాత ఈ ఆలయంలో పూజలు అందుకుంటూ వచ్చే భక్తుల కోరికలు నెరవేరుస్తుంది. పెద్దపల్లి జిల్లా రంగంపల్లి, జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్న కాళికా నగర్ లో నేషనల్ హైవే రోడ్డుకి పక్కనే కాళికా మాత దేవాలయంలో 15 సంవత్సరాలుగా పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు.
ఈ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారిని తమ బాధలు చెప్పుకుంటే వెంటనే తీరుతున్నాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ కాళికా అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం లేదా అమావాస్య రోజున ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో అమ్మవారి వద్ద గుమ్మడి కాయలు అలాగే నిమ్మకాయలు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు అమ్మవారు వద్ద పూజలు నిర్వహించిన నిమ్మకాయలు, గుమ్మడికాయలు ఇస్తారు.
భక్తులు గుమ్మడికాయలు ఇంటి గుమ్మానికి కట్టుకుంటే పట్టిన దరిద్రం, శని అన్ని తొలగి మంచి జరుగుతుంది అని నమ్ముతున్నారు. నిమ్మకాయలు ఇంట్లో పెట్టుకుంటే అమ్మ దయ ఉన్నట్టే అని అంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా మంది భక్తులకు తమ కోరిన కోరికల్లో నెరవేరడం, రోజు వారీ జీవితం కొంచెం మార్పు వస్తుండటంతో ఈ ఆలయానికి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది.