హనుమాన్ చాలీసా విని కదిలింది గర్భంలోని శిశువు. తన కడుపు దగ్గర మొబైల్ పెట్టి హనుమాన్ చాలీసా వినిపించింది ఓ తల్లి, అంతకు ముందు సినిమా పాట పెడితే ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. అయితే ఒక మహిళ గర్భందాల్చింది. అయితే.. ఆమె కడుపులో బిడ్డా క్రమంగా పెరుగుతున్నాడు.ఈ నేపథ్యంలో ఆమెకు చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి పాటలు వినేది. ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో సైతం.. ఆమె దేవుడి పాటలను వింటు ఉండేది.
ఈ క్రమంలో ఆమె ప్రతి రోజు హనుమాన్ చాలీసా వింటు ఉండేది. మరీ ఆమె కడుపులోని బిడ్డ సైతం.. హనుమాన్ కు భక్తుడు అయిపోయినట్లున్నాడు. ఆ హనుమాన్ చాలీసా పట్ల ఎంతగా ప్రభావితమయ్యాడంటే.. కడుపులో ఉన్న శిశువు సైతం హనుమాన్ చాలీసా స్తోత్రం పెడితే కడుపులో నుంచి కదలడం స్టార్ట్ చేశాడు. అయితే.. సదరు మహిళ ఇతర పాటల వీడియో పాటలు పెడితే.. శిశువు రెస్పాండ్ కాలేదు. కానీ గర్భంలోని శిశువు మాత్రం.. హనుమాన్ చాలీసా పెట్టగానే.. కడుపులోని శిశువు కదలడం స్టార్ట్ చేశాడు.
కడుపులోని బిడ్డ కాలితో తన్నుతూ..ఉండటంను ఆమె స్వయంగా ఇంట్లో వాళ్లకు చూపించింది. తొలుత దీన్ని కొంత మంది నమ్మలేదు. కానీ స్వయంగా ఆమె హనుమాన్ చాలీసా పెట్టి మీర తన కడుపులోకి బిడ్డ కదలికల్ని చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. జై శ్రీరామ్ అంటూ భక్తితో పొంగిపోయారు. మరికొందరు ఆ శిశువుకు భూమిపైకి రాకముందే హనుమంతుడి ఆశీస్సులు లభించాయంటూ పొంగిపోతున్నారు.