ఈ ఒక్క పండు తరచూ తింటుంటే చాలు, క్యాన్సర్‌ రోగం పూర్తిగా తగ్గిపోతుంది.

divyaamedia@gmail.com
2 Min Read

ద్రాక్షలో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. కాబట్టి, మధుమేహం ఉన్నవారు లేదా బరువు తగ్గాలని కోరుకునే వారు ద్రాక్షను తక్కువ మొత్తంలో తీసుకోవాలి. కొంతమందికి ద్రాక్షకు అలెర్జీ ఉండవచ్చు. అలెర్జీ లక్షణాలు చర్మం దురద, ఉబ్బరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో తీపి, పుల్లని రుచి ఉండే ద్రాక్ష ముఖ్య పాత్ర పోషిస్తుందని లండన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

ద్రాక్ష రుచికే పరిమితం కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉందని వారు అంటున్నారు. లండన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొన్ని నెలల క్రితం క్యాన్సర్ – ద్రాక్షపై ఒక విస్తృతమైన పరిశోధన నిర్వహించారు. ఈ అధ్యయనంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న కొంతమంది రోగుల ఆహారంలో ద్రాక్షను చేర్చి, దాని ప్రభావాన్ని నిశితంగా గమనించారు. పరిశోధన ముగింపులో పాజిటివ్ ఫలితాలు లభించడానికి ప్రధాన కారణం ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే శక్తివంతమైన సహజ సమ్మేళనం.

ఇది ఒక రకమైన పాలీఫెనాల్. ఇది ముఖ్యంగా నలుపు, ఎరుపు ద్రాక్ష యొక్కపై చర్మంలో అధిక మొత్తంలో లభిస్తుంది. ఈ రెస్వెరాట్రాల్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో, అవి ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుందని వారి నివేదిక తెలిపింది. ద్రాక్ష క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా తొలగించకపోయినా, దాని ముప్పును మాత్రం గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. ద్రాక్షలో రెస్వెరాట్రాల్‌తో పాటు మన శరీరానికి మేలు చేసే అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి.

ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌‌తో పోరాడుతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడే సైనికుల్లా పనిచేస్తాయి. ద్రాక్షలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా శరీరం అంటువ్యాధులు మరియు ఇతర వ్యాధుల నుండి రక్షించబడుతుంది. క్యాన్సర్ నివారణకు ద్రాక్షను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *