బంగారం, వెండి ధరలు తగ్గడానికి స్పష్టమైన కారణాలు లేవు. అయితే నిపుణులు మాత్రం ఓ రెండు రెండు ప్రధాన కారణాలను సూచించారు. ఒకటి.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది, ఇది ప్రపంచ వాణిజ్య వాతావరణాన్ని సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. రెండో కారణం బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు వాటిని అమ్ముతున్నారు.
బంగారం, వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. సాధారణ సంవత్సరాల్లో వాటి ధరలు 10-12 శాతం మాత్రమే పెరుగుతాయి. భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగి వస్తున్నాయి. తులం బంగారం ధర లక్షా 33 వేల వరకు వెళ్లిన బంగారం ధర.. ప్రస్తుతం లక్షా 25 వేల వరకు దిగి వచ్చింది. ఇక వెండి విషయానికొస్తే 2 లక్షల రూపాయల చేరువలో ఉన్న వెండి ధర ప్రస్తుతం లక్షా 59 వేల రూపాయల వరకు దిగి వచ్చింది.

దీపావళి తర్వాత బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి . అంతర్జాతీయ మార్కెట్ 12 సంవత్సరాల రికార్డు కనిష్ట స్థాయిని నమోదు చేయగా, దేశీయ మార్కెట్ కూడా భారీగా తగ్గింది. అక్టోబర్ 21న ప్రపంచ మార్కెట్లో అమ్మకాలు, దీపావళి-ధంతేరాస్ తర్వాత కొనుగోళ్లు తగ్గడం వల్ల ఈ తగ్గుదల సంభవించింది. వెండి ఫ్యూచర్స్ కూడా ఔన్సుకు దాదాపు 2% తగ్గి $46.82కి చేరుకున్నాయి.
అయితే, అక్టోబర్ 23వ తేదీ గురువారం బంగారం, వెండి ఫ్యూచర్స్ కొద్దిగా మెరుగుపడి వరుసగా $4,102, $47 కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయి. ఇంతలో అక్టోబర్ 22న దేశీయ మార్కెట్లో క్షీణత తర్వాత, మార్కెట్ అక్టోబర్ 23న కోలుకుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.810 తగ్గి రూ.1,25,080 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.750 తగ్గి ప్రస్తుతం రూ.1,14,650కి చేరుకుంది.
ఇక వెండి ధరపై రూ.1000 తగ్గి ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,59,000 వద్ద ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,25,080 ఉంది. అలాగే ఢిల్లీలో తులం ధర రూ.1,25,603 ఉంది
