గ్లోబల్ మార్కెట్లలో GMT తెల్లవారుజామున 1:15 నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,113.54 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, డిసెంబర్ డెలివరీకి సంబంధించిన US గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి ఔన్సుకు 4,129.80 డాలర్ల వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ 0.9 శాతం తగ్గి ఔన్సుకు 48.29 డాలర్లకు చేరుకుంది, ప్లాటినం 1.1 శాతం తగ్గి 1,534.44 డాలర్లకు చేరుకుంది, పల్లాడియం ఔన్సుకు 1,406.76 డాలర్ల వద్ద పెద్దగా మారలేదు.
అయితే బంగారం ధరలు భగభగమంటున్నాయి. గత కొన్ని నెలలుగా అంతకంతకూ పెరుగుతూ మహిళలకు గట్టి షాక్ ఇస్తున్నాయి. గత ఏడాది రూ.70వేలకు పైగా ఉన్న బంగారం ఇప్పుడు రూ.లక్షా 30వేలకు చేరింది. ఏకంగా ఒక్క ఏడాదిలోనే 60శాతం మేర పెరగడం గమనార్హం. బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. రాజకీయ అనిశ్చితులు కారణంగా బంగారం ధరలు పెరగడం ప్రధాన కారణమని చెబుతోంది.

అయితే ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,720గా ఉంది. నిన్న ఇది రూ.1,30,730గా ఉంది. నిన్నటికి ఇవాళ్టికి స్వల్పంగా అంటే రూ.10రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,30,570గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,30,580గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,19,690 ఉండగా.. నిన్న రూ.1,19,700గా ఉంది.
అంటే నిన్నటికి ఇవాళ్టికి బంగారం స్వల్పంగా రూ.10రూపాయలు పెరిగింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.97,930గా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెంట్ల 10 తులాల బంగారం రూ.1,30,570గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,30,580గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,690గా ఉండగా.. నిన్న 1,19,700గా ఉంది. ఇక మన పక్క రాష్ట్రం తమిళనాడులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,30,920 ఉంది.
ఈ ధర నిన్న రూ.1,30,910గా ఉండేది. అంటే రూ.10 పెరిగింది. అదేవిధంగా బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,570గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,690గా ఉంది.
