గోల్డ్ రిజర్వ్స్ ను బట్టి ఒక్కో దేశంలో ఒక్కోరకంగా బంగారం ధరలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు ఆర్థికంగా మనకంటే వెనుక ఉన్నా బంగారం ధరలు మాత్రం అక్కడ తక్కువగా ఉన్నాయి. అయితే ఇన్నాళ్లూ ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన గోల్డ్ రేట్లు.. కంప్లీట్ యూటర్న్ తీసుకున్నాయి. ఒక్కరోజులో 9వేలు పడిపోవడంతో.. బులియన్ మార్కెట్లో కాస్తంత రిలీఫ్ కనిపిస్తోంది.
ఈనెల 16న 24 క్యారెట్ల తులం బంగారం లక్షా 36వేల ధర పలికింది. ఇక లక్షన్నరే టార్గెట్గా పసిడి పరుగులు తీస్తుందని అంతా భావించారు కాని.. జరిగింది వేరు. బంగారం రూటు మార్చి దిగొస్తోంది. అమెరికా లెక్కల ప్రకారం ఔన్సు బంగారం 4360 డాలర్లను తాకింది. రెండ్రోజులు అక్కడే చక్కర్లు కొట్టి.. ఒక్కసారిగా టప్ మని పడిపోయింది. రెండు రోజుల్లో 300 డాలర్లు దిగింది. ఇంకా తగ్గుతుందన్న టాక్ ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధర లక్షా 25వేల 880కి చేరింది. ఇక కిలో వెండి ధర.. లక్షా 74వేల 900కి చేరింది. వెండి ఒకానొక దశలో లక్షా 88వేలకు చేరుకుని.. ఇప్పుడు పదిహేను వేల వరకు దిగివచ్చింది. మరికొన్ని రోజుల్లో బంగారం ధరలు ఇంకా పడిపోయే అవకాశాలున్నాయి. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
ట్రంప్ పేల్చిన బాంబుతో బంగారం పడిపోతోంది. చైనాతో ఇన్నిరోజులు కయ్యం పెట్టుకున్న ట్రంప్.. ఇప్పుడు ఆ దేశంపై సుంకాలు ఎక్కువ రోజులు కొనసాగవని సంకేతాలు ఇవ్వడంతో బంగారం తగ్గుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. కొన్ని రోజులుగా పెరుగుతూపోయిన బంగారం మార్కెట్లో.. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదికూడా ఒక కారణమే.
గతేడాది ట్రంప్ గెలిచిన దగ్గర్నుంచి పెరుగుతూపోయిన బంగారం ధర.. ఇప్పుడు తగ్గడానికి ముఖ్యమైన కారణమేంటంటే.. అనేక దేశాల్లో యుద్ధవాతావరణ పరిస్థితులు తొలగిపోయి.. సాధారణ పరిస్థితులు నెలకొనడం కూడా ఇంకో కారణం.
