శుభకార్యాల్లో కూడా బంగారం కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. జనం పెట్టుబడులకు కూడా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలతో గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ పోయాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు అనుకూలంగా ఉండటం, పెట్టుబడిదారుల ఆసక్తి స్టాక్ మార్కెట్స్ పై ఉండడంతో బంగారం ధరలు తగ్గాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై 5వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,870, 22 క్యారెట్ల ధర రూ.90,640 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,09,900 లుగా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490 ఉంది. వెండి ధర కిలో రూ.1,09,900 గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.98,720 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,19,900 లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,09,900 లుగా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,720 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,490 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,900 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,19,900 లుగా ఉంది.
విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,19,900 లుగా ఉంది. గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.