తాజా జీడీపీ డేటా రెండో త్రైమాసికంలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిందని సూచిస్తుందని తెలిపారు. ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) జతిన్ త్రివేది మాట్లాడుతూ బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయన్నారు. అయితే గత రెండు రోజులుగా మళ్లీ బంగారం ధర తగ్గుతూ వస్తోంది.
దేశీయ మార్కెట్లలో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.550 తగ్గి, రూ.1,22,020 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500 తగ్గి రూ.1,11,850కి చేరింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.దేశీయ మార్కెట్లలో కేజీ వెండి రూ.1,65,000 గా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి దరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,22,170, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,030 గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,020 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,11,850 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,950, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,700 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,020, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,850 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,22,020 ఉంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,850 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,65,000 లుగా ఉంది. ఈ ధరలు ఉదయం 11 గంటలకు నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
