పెళ్లిళ్లు, ఆభరణాల కొనుగోళ్లు లేదా భవిష్యత్తు పొదుపులు – అన్నీ ఇప్పుడు భారీ ఖర్చుతో కూడినవిగా మారాయి. ఈ రికార్డు స్థాయి ధరల పెరుగుదల మధ్యలోనే నిపుణులు ఒక పెద్ద ప్రమాదం గురించి కూడా హెచ్చరిస్తున్నారు. ధరలు ఎంత వేగంగా పైకి వెళ్లాయో, అంతే వేగంగా కిందికి రావచ్చని, ఒకే రోజులోనే 10 నుంచి 20 శాతం వరకు భారీ పతనం కనిపించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
అయితే డిసెంబర్ 29న సాయంత్రం బంగారం ధర ఉన్నట్లుండి ఒకేసారి రూ.3 వేలు తగ్గింది. సోమవారం ఉదయం తులం బంగారంపై కేవలం రూ.650 మాత్రమే తగ్గగా.. సాయంత్రానికి ఏకంగా రూ.2900 తగ్గింది. దీంతో ఇవాళ మొత్తం రూ.3170 తగ్గినట్లు అయింది. తగ్గిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,39,250గా ఉంది.

నిన్న ఈ ధర రూ.1,42,420 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు సాయంత్రం రూ.2900 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,27,650 వద్ద కొనసాగుతోంది. అటు చెన్నైలో బంగారం రేట్లు ఎక్కువగా తగ్గలేదు. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,040గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,42,910 వద్ద స్థిరపడింది.
అంటే నిన్నటితో పోలిస్తే కేవలం రూ.870 మాత్రమే తగ్గుముఖం పట్టింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,30,200గా ఉంది. ఆదివారం ఈ ధర రూ.1,31,000గా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే రూ.800 తగ్గిందని చెప్పవచ్చు.
