భారత ప్రభుత్వం తాజాగా బంగారం, వెండి దిగుమతుల సుంకాల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల బంగారం ధరపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ధరలు దిగి వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అయితే దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గాయి. నేడు మార్చి 3వ తేదీ సోమవారం నాడు కూడా బంగారం ధరలు తగ్గాయి. గత కొంత కాలంగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరిన విషయం తెలిసిందే.
అమెరికా డాలర్ పుంజుకోవడంతో గత నాలుగు రోజులుగా గోల్డ్ ధరలు దిగివస్తున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వరుసగా తగ్గి ఇప్పుడు స్వల్పంగా పెరిగాయి. దేశీయంగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2858 డాలర్ల దగ్గర ఉండగా…నేడు స్వల్పంగా పెరిగింది. 2870 డాలర్ల స్థాయికి చేరుకుంది. అయితే ఆల్ టైమ్ గరిష్టాలకు చాలా దూరంలోనే ఉంది. ఇంకా స్పాట్ సిల్వర్ ధర ఇప్పుడు 31.40 డాలర్ల దగ్గర కదలాడుతోంది.
ఇదే సమయంలో డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 87.48 దగ్గర ట్రేడ్ అవుతోంది. దేశీయ మార్కెట్లో మాత్రం వరుసగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో 22క్యారెట్ల బంగారం ధర తులం రూ. 79,400 దగ్గర కొనసాగుతోంది. దీనికి ముందు వరుసగా రూ. 200, రూ. 500, రూ. 400, రూ. 250 చొప్పున ధరలు పతనం అయ్యాయి. 24క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు ప్రస్తుతం హైదరాబాద్ లో రూ. 86,620కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కూడా ఇదే విధంగా స్థిరంగానే కొనసాగుతున్నాయి.
ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 79, 550 దగ్గర ఉంది. 24క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర తులానికి రూ. 86,770 దగ్గర కదలాడుతోంది. బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 97వేల దగ్గర ఉంది. హైదరాబాద్ లో 1.05లక్షలు పలుకుతోంది. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాల కారణంగా బంగారం ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి.