భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు కూడా మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 తగ్గగా, ఇంకోవైపు వెండి కూడా కిలోకు దాదాపు రూ.2 వేలకుపైగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉదయం 6.28 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76830కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 70440కు చేరింది.
ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 76,680కు చేరగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 70290 స్థాయికి చేరింది. బులియన్ మార్కెట్లో గురువారం (అక్టోబర్ 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,250గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.76,640గా నమోదైంది. మరోవైపు వరుసగా మూడు రోజులు తగ్గిన వెండి ధర.. నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.94,000గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్షగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి 88 వేలుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 22 క్యారెట్ల బంగారం ధరలు: హైదరాబాద్ – రూ.70,250, విజయవాడ – రూ.70,250, ఢిల్లీ – రూ.70,400, చెన్నై – రూ.70,250, బెంగళూరు – రూ.70,250, ముంబై – రూ.70,250, కోల్కతా – రూ.70,250, కేరళ – రూ.70,250.
24 క్యారెట్ల బంగారం ధరలు: హైదరాబాద్ – రూ.76,640, విజయవాడ – రూ.76,640, ఢిల్లీ – రూ.76,790, చెన్నై – రూ.76,640, బెంగళూరు – రూ.76,640, ముంబై – రూ.76,640, కోల్కతా – రూ.76,640, కేరళ – రూ.76,640. పైన పేర్కొన్న బంగారం ధరలు సూచికగా మాత్రమే ఉంటాయి. వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలను కలిగి ఉండవని గమనించగలరు.