అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటనతో బంగారం ధరల్లో ఊహించని మార్పు జరిగింది. బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు సరికొత్త గరిష్ఠాలను తాకింది. దీంతో దేశీయ మార్కెట్ లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దసరా పండగ సీజన్ మొదలైంది. అయితే గత కోన్ని రోజులుగా బంగారం ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతూనే ఉన్నాయి.
మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల తులం బంగారం ధర రికార్డు స్థాయిలో లక్షా 13 వేల మార్క్ దాటి ఆల్ టైం హైకి చేరుకుంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తుంది. నిజానికి ఈ రెండింటి ధరలు బులియన్ మార్కెట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి వీటి ధరలు కొన్నిసార్లు పెరిగితే.. మరికొన్ని కొన్నిసార్లు తగ్గుతాయి.

అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం, వెండి ధరలు కాస్త స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బంగారంపై రూ.10 తగ్గగా, వెండిపై రూ.100 వరకు తగ్గాయి. సెప్టెంబర్ 22 2025 సోమవారం ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.1,12,140 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.1,02,790 కి చేరుకుంది. వెండి కిలో ధర రూ.100 తగ్గి.. రూ.1,34,900లుగా ఉంది.