బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా పెరుగుతున్న ధరలను చూసి సామాన్యులు భయపడిపోతున్నారు. ఇప్పటికే భారత్‌లో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. అయితే చైనాలోని ఓ పాఠశాలలో చదువుతున్న ఒక అమ్మాయి తన కోసం కొన్ని ఫ్యాషన్ నగలు కావాలని కోరుకుంది. దీని కోసం తన తల్లి విలువైన ఆభరణాలను తీసుకొని మార్కెట్లో కేవలం 700 రూపాయలకు అమ్మేసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే తన తల్లికి ఈ విషయం తెలియగానే, ఆమె షాక్ అయ్యింది.
1 మిలియన్ యువాన్ విలువైన నగలు కేవలం 60 యువాన్లకు అమ్మడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. మంచి విషయం ఏమిటంటే పోలీసులు ఈ కేసులో సహాయం చేసారు. డబ్బు కోసం ఖరీదైన నగలను అమ్మేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ కేసు చైనాలోని షాంఘైకి చెందినది. అక్కడ స్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయి తన తల్లికి చెందిన కోట్ల విలువైన నగలను తీసుకుని మార్కెట్‌లోని ఒక చిన్న స్టాల్‌కి వెళ్లింది. పోలీసుల నివేదిక ప్రకారం, ఆ నగల మొత్తం విలువ రూ.1 కోటి 22,59,355.
అయితే ఆ అమ్మాయికి దాని విలువ ఏంతో తెలియదు. తనకి కావాల్సిన లిప్ స్టడ్స్, ఇయర్ రింగ్స్ కావాలని కోరుకుంది. ఈ రెండూ 60 యువాన్లకు అంటే 700 రూపాయలకు లభిస్తాయి. కాబట్టి ఆ అమ్మాయి నగలను దుకాణదారునికి ఇచ్చి, బదులుగా తనకు ఇష్టమైన వస్తువును తీసుకుంది. ఈ విషయం బాలిక తల్లికి తెలియగానే, ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిఘా ఫుటేజ్ ద్వారా దుకాణదారుడిని గుర్తించి అతనికి ఫోన్ చేశారు.
ఏదో విధంగా అతను నగలు తీసుకుని తిరిగి వచ్చాడు. చివరికి ఆ విలువైన నగలను తిరిగి ఇచ్చాడు ఆ షాపు వాడు. అయితే ఆ నగలు అంత ఖరీదైనవని తనకు తెలియదని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, కొంతమంది పేరెంటింగ్ లోపాల వల్లే ఇలా జరుగుతాయని అన్నారు. మరికొందరు ఆ అమ్మాయిపై కామెంట్స్ చేశారు.