కొంత మంది అమ్మాయిలు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం వివాదాస్పదంగా మారిందని చెప్పుకొవచ్చు. రీల్స్, వ్యూస్ , కామెంట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో ఒక యువతి ఏకంగా హైటెన్షన్ విద్యుత్ పోల్ ఎక్కి మరీ రీల్స్ చేసింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. యువతి.. విద్యుత్ పోల్ ఎక్కి నిలబడింది. అంతే కాకుండా.. అక్కడ వయర్ లను పట్టుకుని డ్యాన్స్ చేస్తు రీల్స్ చేస్తుంది.
దూరం నుంచి ఎవరో ఈమే పైత్యాన్ని రికార్డు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో ఇటీవల అనేక వీడియోలు, రీల్స్ తెగ ట్రెండింగ్ గా ఉంటున్నాయి. కొంతమంది ఫెమస్ అయ్యేందుకు ఇటీవల రీల్స్, వీడియోలు తీసుకుని సామాజిక మాధ్యమాలలో అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో కొంత మంది మాత్రం ఓవర్ నైట్లో పబ్లిసిటీని పొందుతున్నారు.
దీంతో ఇటీవల కాలంలో బస్టాండ్ లు, మెట్రోలు, ఎయిర్ పోర్టులు .. ఇలా ప్రతిచోటు కూడా రీల్స్ తీసుకుంటూ నానారచ్చ చేస్తున్నారు. కొంత మంది అయితే.. తమ ప్రాణాలను సైతంపణంగా పెట్టి మరీ రీల్స్ చేస్తున్నారు. కొందరు జంతువుల దగ్గరకు వెళ్లి కూడా రీల్స్ చేసి తమ ప్రాణాల్ని రిస్క్ లో నెట్టుకుంటున్నారు.
జలపాతాలు, కొండ ప్రాంతాలు, సముద్రాలు.. మొదలైన ప్రదేశాలకు వెళ్లి రీల్స్ చేస్తు రెచ్చిపోతున్నారు. ఏదీ ఏమైన ఓవర్ నైట్ లో స్టార్ డమ్ కోసం నానా వేశాలు వేస్తున్నారు.