కింగ్ కోబ్రా పాముని పట్టుకొని కళ్లలో కళ్లు పెట్టి చూస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

పాములు ముఖ్యంగా వర్షాకాలంలో మన ఇంటిలోకి రాకుండా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకొవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి డోర్ లు, పెంట్ హౌస్ లు, బాత్రూమ్ కిటికీలలోహోల్స్ లేకుండా చూసుకొవాలి. అదే విధంగా కర్రలు కుప్పలుగా కుప్పలుగా పడేసి ఉంచకూడదు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి కింగ్ కోబ్రా పాముని పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. అయితే ఆ అమ్మాయి కోబ్రా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడం కూడా గమనించవచ్చు.

ఆ యువతి దాదాపు 20 సెకండ్ల వరకు పాము కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా పాములు ప్రమాదకరమైన వారిని తెలిసినప్పటికీ కూడా ఆ యువతి పాము కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడం చూస్తూ ఉంటే.. ఆ పాము పెంచుకున్నదిగా అనిపిస్తోంది. ఇప్పటికి అదే స్థానంలో ఏదైనా పాము ఉంటే తప్పకుండా తన తలపై కాటు వేసేది. అంతేకాకుండా ఆ పామును పట్టుకున్నందుకు ఆగ్రహానికి గురై ఎక్కడ దొరికితే అక్కడ దాడి చేసేది.

ఈ పాము పెంచుకున్నది కావడంతో ఏమాత్రం దాడి చేయలేకపోయిందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు. సాధారణంగా పెంచుకున్న కొన్ని పాములు మాత్రమే విషపూరితంగా ఉంటాయి. అయితే ఇందులో పాము కోరలు తీసింది కావడంతో ఆ యువతని దాడి చేయలేక పోయింది. ఈ తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోను స్నేక్ రెస్క్యూర్ దీపిక అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కోటి మందికి పైగా వీక్షించినట్లు సమాచారం.

అంతేకాకుండా ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా నెటిజన్స్ లైక్ చేశారు. ఇక చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు కూడా చేశారు. ఈ వీడియోలో ఒక యువకుడు ” ఒక పాము.. ఇంకో పామును చూస్తోంది” అని కామెంట్ చేశాడు. చాలామంది ఈ వీడియోకు ఎక్కువగా ఫన్నీ కామెంట్స్ చేశారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *